Diya Kumari Comment : రాజ సౌధం వీడిన రాజ‌కుమారి

ఎవ‌రీ దియా కుమారి ఏమిటా క‌థ

Diya Kumari : ఎవ‌రికి ఎప్పుడు అదృష్టం త‌లుపు త‌డుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. దేశ వ్యాప్తంగా ఎవ‌రీ దియా కుమారి అని త‌న‌ను వెతికేలా చేసుకున్నారు. ఇంతలా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారిన ఈమె ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారారు. దీనికి కార‌ణం లేక పోలేదు. రాజ‌స్థాన్ లో తాజాగా ఎన్నిక‌లు ముగిశాయి. ప‌వ‌ర్ లో ఉన్న కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. దీని స్థానంలో బీజేపీ కొలువు తీరింది. ఎవ‌రికి పాల‌నా ప‌గ్గాలు ఇవ్వాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డింది. చ‌ర్చోప చ‌ర్చ‌లు చేసింది. చివ‌ర‌కు ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా సైతం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. మూడు రాష్ట్రాల‌లో సీఎంల ఎంపిక స‌వాల్ గా మారింది కాషాయ ద‌ళానికి . ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి తెర పైకి కొత్త పేరు వ‌చ్చింది. ఆ పేరే దియా కుమారి. ఆమె రాజ‌స్థాన్ లోని రాజ వంశానికి చెందింది.

Diya Kumari Comment Viral

రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో విద్యాధ‌ర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించింది. ఆమె వంశం మొత్తం రాజ‌కీయాల‌లో కీల‌కంగా ఉన్నారు. వారి ముద్ర చెర‌ప‌లేనిది. దియా కుమారి తండ్రి 1998లో ఎంపీగా పోటీ చేసి ఓడి పోయారు. అమ్మ‌మ్మ గాయత్రి దేవి 1962, 1967, 1971 ఎన్నిక‌ల్లో మూడుసార్లు ఎంపీగా విజ‌యం సాధించారు. ఇదిలా ఉండ‌గా 2013లో బీజేపీలో మోదీ, షా స‌మ‌క్షంలో దియా కుమారి(Diya Kumari) చేరారు. మాధోపూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018లో దూరంగా ఉన్నారు. 2019లో అనూహ్యంగా రాజ్ స‌మంద్ నుంచి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కొత్త‌గా ఎమ్మెల్యేగా ఎన్నికైన ల‌క్ష్మ‌ణ్ శ‌ర్మ‌కు సీఎంగా క‌ట్ట‌బెడితే..అనూహ్యంగా దియా కుమారికి ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించింది బీజేపీ హైక‌మాండ్.

జైపూర్ రాజ వంశానికి చెందిన ఆమె గురించి ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. అదేమిటంటే ఓ సామాన్యుడిని ఏరికోరి ఎంచుకుంది. తాను రాజ‌కుమారి అయినా ఏనాడూ అలా ఆలోచించ‌లేదు. వీధుల్లో న‌డుచుకుంటూ జ‌నంతో మ‌మేక‌మై ఉండ‌డంతో ఎక్కువ‌గా జ‌నాద‌ర‌ణ పొందారు దియా కుమారి. ఎలాంటి రాజ కుటుంబ నేప‌థ్యం లేక పోయినా కేవలం త‌న స్వ‌శ‌క్తితో క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్న వ్య‌క్తిని పెళ్లాడింది దియా కుమారి. ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంగా ఎన్నిక కావ‌డంతో ఒక్క‌సారిగా దేశం ఆమె వైపు చూసేలా చేసుకుంది. వేసే అడుగులు ప‌దిలంగా ఉంటే అనుకున్న గ‌మ్యానికి చేరుకోవ‌డం క‌ష్టం కాద‌ని అంటోంది దియా కుమారి. జీవితం ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ఎరుక‌తో ఉంటే ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచు కోవ‌డం సుల‌భ‌మేనంటోంది దియా కుమారి.

Also Read : CM Revanth Reddy Comment : రేవంత్ ముద్ర గుండెల్లో ద‌డ‌

Leave A Reply

Your Email Id will not be published!