Sridhar Babu : ఐటీ మంత్రిగా కొలువు తీరిన దుద్దిళ్ల
సంతకం చేసిన శ్రీధర్ బాబు
Sridhar Babu : హైదరాబాద్ – గత సర్కార్ లో కీలకమైన పాత్ర పోషించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన నిర్వహించిన ఐటీ శాఖకు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చేలా చేశారు. ఇందులో సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కొత్తగా కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది.
Sridhar Babu As a IT Minister Telangana
పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. కేటీఆర్ ను ఢీకొనే సత్తా కలిగిన నాయకుడు కాంగ్రెస్ లో లేరని గులాబీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. ఇంకా ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
ఈ తరుణంలో ఐటీ పరంగా కంపెనీతో పాటు అనుభవం కలిగిన మదన్ మోహన్ రావుకు అప్పగిస్తారని అనుకున్నారంతా. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు భిన్నంగా మంథని ఎమ్మెల్యేగా గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు(Sridhar Babu) ఐటీ శాఖను అప్పగించారు. అంతే కాకుండా కీలకమైన పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖలు అప్పగించారు.
అత్యంత సౌమ్యుడిగా , అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు శ్రీధర్ బాబు. గురువారం బీఆర్ అంబేద్కర్ సచివాలంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో కార్యదర్శి జయేష్ రంజన్ సంతకం చేయించారు.
Also Read : Assembly Security : తెలంగాణ అసెంబ్లీ వద్ద భారీ భద్రత