CM Revanth Reddy : గ్రామ సభల్లోనే లబ్దిదారుల ఎంపిక
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటన
CM Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి దూకుడు పెంచారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పీఏసీ సమావేశంలో ప్రజలు తమకు పట్టం కట్టినందుకు ధన్యవాదాలు తెలియ చేశామన్నారు.
CM Revanth Reddy Comment
ఇదే సమయంలో సంక్షేమ పథకాలకు ఢోకా లేదని స్పష్టం చేశారు సీఎం. మన కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అందాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.
బిఫామ్ ఇచ్చిన నాయకుడి నుంచే పథకాలు అందాలన్నారు. పల్లెల్లో గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుందని , లబ్దిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు తెలంగాణ సీఎం(CM Revanth Reddy). నెల రోజుల్లోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు.
శాసన మండలి సభ్యులను ఎవరిని ఎంపిక చేయాలనే దాని విషయం తన పరిధిలో లేదన్నారు రేవంత్ రెడ్డి. వీరిని ఎంపిక చేసే బాధ్యత హైకమాండ్ చూసుకుంటుందని ప్రకటించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఎంపీలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
Also Read : Shabbir Ali : త్వరలో పదవుల పందేరం