JD Laxminarayana : జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ
జై భారత్ నేషనల్ పార్టీ
JD Laxminarayana : అమరావతి – మాజీ సీబీఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పేరును కూడా ఖరారు చేశారు. గత కొంత కాలంగా ఆయన ఇంపాక్ట్ ద్వారా , తన ఫౌండేషన్ ద్వారా లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ వస్తున్నారు.
JD Laxminarayana New Party Viral
ఇదిలా ఉండగా తను కొత్తగా స్థాపించిన పార్టీని వెల్లడించారు. జై భారత్ నేషనల్ పార్టీ అని ఖరారు చేసినట్లు తెలిపారు జేడీ లక్ష్మీ నారాయణ(JD Laxminarayana). ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పుడున్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ రావాల్సిన అవసరం ఉందన్నారు .
గత కొన్నేళ్లుగా జనం సమస్యలతో ఎదుర్కొంటున్నారని , అవి అమలుకు నోచుకోవాలంటే రాజ్యాధికారం కావాలని ఏనాడో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్పష్టం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మాజీ సీబీఐ జేడీ.
ఆ దిశగానే తాను అడుగులు వేయాలని అనుకున్నానని, రాజకీయాల్లో ముందుకు రావాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు జేడీ లక్ష్మీనారాయణ.
Also Read : Pawan Kalyan : లోకేష్ యాత్ర అదుర్స్