Merugu Nagarjuna : చంద్రబాబు ఓ గజ దొంగ
ఏపీ మంత్రి మేరుగ నాగార్జున
Merugu Nagarjuna : అమరావతి – ఎన్నికల వేళ మాయ మాటలు చెప్పేందుకు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారని , ప్రజలను ఎవరు మోసం చేశారనేది ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున(Merugu Nagarjuna). చంద్రబాబు ఓ గజ దొంగ అని సంచలన ఆరోపణలు చేశారు. క్రైస్తవులు, దళితుల మీద పనిగట్టుకుని దాడులు చేయించిన ఘనుడు అంటూ మండిపడ్డారు. అక్రమంగా, అమానుషకరమైన రీతిలో కేసులు నమోదు చేశారని వాపోయారు మేరుగ నాగార్జున.
Merugu Nagarjuna Slams Chandrababu
ఏపీలో వైసీపీ పాలన వచ్చాక జగన్ మోహన్ రెడ్డి దళితులు, క్రైస్తవులపై నమోదు చేసిన అక్రమ కేసులను పూర్తిగా ఎత్తి వేసినట్లు చెప్పారు. చంద్రబాబుకు మానవత్వం అన్నది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు కనీవిని ఎరుగని రీతిలో మేలు చేస్తున్న ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు మేరుగ నాగార్జున.
చంద్రబాబు భజన మీడియా బాకాలు ఊదుతోందని, రెచ్చి పోయి ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తోందంటూ ధ్వజమెత్తారు. అయినా జనం జగన్ ను తప్ప చంద్రబాబు ను, పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ ను నమ్మే స్థితిలో లేరన్నారు మేరుగ నాగార్జున.
Also Read : Chandra Babu Case : బాబుకు ఊరట విచారణ వాయిదా