Congress Promises : విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు
పంపిణీ చేసేందుకు కాంగ్రస్ సర్కార్ రెడీ
Congress Promises : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఆధ్వర్యంలో బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.
Congress Promises Viral
మరో గ్యారెంటీ కింద ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచింది. ఇదే సమయంలో విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు స్కూటీలు ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 350 కోట్లతో విద్యుత్ స్కూటీలు ఇచ్చే పనిలో పడింది.
18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఈ సదుపాయాన్ని వర్తింప చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 1,784 కాలేజీలు ఉన్నాయి. పేద విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉన్నారని అంచనా వేసింది సర్కార్.
కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీకి 50 వేల రూపాయల చొప్పున 70 వేల స్కూటీలకు రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఈ పథకాన్ని వర్తింప చేసేందుకు విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలు త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
Also Read : Kapileswara Swamy : కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం