AP CM YS Jagan : క్రీడలకు ఏపీ సర్కార్ ప్రయారిటీ
స్పష్టం చేసిన సీఎం జగన్ రెడ్డి
AP CM YS Jagan : అమరావతి – క్రీడలు జీవితంలో తప్పనిసరిగా భాగం కావాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ రెడ్డి(AP CM YS Jagan) బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేశారు. తనకు కూడా క్రీడలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు.
AP CM YS Jagan Sports Viral
తాము రాష్ట్రంలో కొలువు తీరాక క్రీడల అభివృద్దికి కృషి చేశామని అన్నారు. భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు సీఎం. గత సర్కార్ క్రీడలను ప్రత్యేకించి గ్రామీణ క్రీడలను పట్టించు కోలేదని ఆరోపించారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు జగన్ రెడ్డి. పండుగ వాతావరణంలో క్రీడా సంబురాలు కొనసాగుతున్నాయని ఇది విద్యార్థులతో పాటు యువతీ యువకులకు మరింత మేలు జరుగుతుందన్నారు.
చదువుతో పాటు క్రీడలు కూడా అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా ఇవాళ గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్ లో ఆడుదాం ఆంధ్రా 2023 పోటీలను ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందన్నారు సీఎం.
Also Read : Foxconn Provide : ఫాక్స్ కాన్ ఏర్పాటుతో ఉపాధి