Shakeel Son : హైదరాబాద్ – నిజామాబాద్ జిల్లా బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ సంచలనంగా మారారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని షీకల్ చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. కొడుకు బలాదూర్ గా తిరుగుతూ వేగంగా కారు నడిపాడు. 2022లో ఓ చిన్నారిని బలి గొన్నాడు.
Shakeel Son Got Out Notice
ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ కొలువు తీరి ఉండడంతో పెద్దల అండదండలతో పోలీసులను మ్యానేజ్ చేశారు. కేసు నమోదు కాకుండా చేశారు. కొడుక్కి బదులు వేరొకరిని ఇరికించే ప్రయత్నం చేశారు.
తాజాగా ప్రజా భవన్ ముందు గేట్ ను సోహెల్ డ్రైవింగ్ చేస్తూ ఢీకొట్టాడు. ఈ ఘటన కలకలం రేపింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చిన పంజాగుట్ట ఇన్స్ పెక్టర్ దుర్గా రావును సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేటు వేశారు. ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel) కొడుకు సోహెల్ ఎక్కడున్నా పట్టుకుని తీరుతామని హెచ్చరించారు సీపీ.
హైదరాబాద్ దాటి దుబాయ్ కి పారి పోయినట్లు సోహెల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరగడంతో పోలీసులు మేలుకొన్నారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసేందుకు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే దుర్గారావు సోహెల్ ను కాకుండా ఇతరులపై కేసు నమోదు చేయడం కలకలం రేపింది.
Also Read : Congress Govt Shock : రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా