Dubai Prisioners: దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి !
దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి !
Dubai Prisioners: నేపాల్ కు చెందిన వాచ్ మెన్ హత్య కేసులో దుబాయ్(Dubai) లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గత 18 ఏళ్లుగా దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న… వీరిని ఎట్టకేలకు అక్కడ ప్రభుత్వం విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్ళి… హత్యకు గురైన వాచ్ మెన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి రూ. 15 లక్షలు నష్ట పరిహారం అందించారు. అనంతరం వారు స్వయంగా రాసిఇచ్చిన క్షమాభిక్ష పత్రాన్ని దుబాయ్ కోర్టుకు అందజేసారు. అయితే మారిన కోర్టు నిబంధనలతో… ఆ క్షమాబిక్ష పత్రానికి ఆమోదం లభించకపోవడంతో వారిని జైలు నుండి విడుదల చేయలేదు. అయితే అనారోగ్య కారణాలు చూపతుూ నిందితుల తరపున న్యాయవాదులు మరోసారి వారి విడుదలకు ప్రయత్నించారు. దీనితో న్యాయవాదుల పిటీషన్ పై విచారణ చేపట్టిన దుబాయ్ కోర్టు…. ఏడేళ్ళు ముందే వారిని విడుదల చేసింది. దీనితో బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వారు… సుమారు 18 ఏళ్ళ తరువాత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
Dubai Prisioners Release Update
దుబాయ్ లో నివాసం ఉంటున్న నేపాల్ కు చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో తెలంగాణాలోని సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కోర్టు పదేళ్ళపాటు జైలు శిక్ష విధించింది. ఆ తరువాత మర వీరి శిక్షను 25 ఏళ్ళకు పెంచింది. దీనితో మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్ళి హత్యకు గురైన బహదూర్ సింగ్ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా… మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు. అయితే అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించడంతో ఎట్టకేలకు దుబాయ్ కోర్టు వీరిని విడుదల చేసింది. దీనితో దుబాయ్ నుంచి సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు.
Also Read : CM YS Jagan Mohan Reddy: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు !