22న వరలక్ష్మి, నవీన్ చంద్రల పోలీస్ కంప్లైంట్ రిలీజ్

సంజీవ్ మేగోటి దర్శకత్వంలో హారర్–యాక్షన్ థ్రిల్లర్

హైద‌రాబాద్ : విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వ‌స్తోంది. ఇక టాలీవుడ్‌లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ మూవీ మే 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించిన కృష్ణసాయి బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న అభిమాన న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ వరలక్ష్మి శరత్‌కుమార్ నవీన్ చంద్ర చంద్ర క్రేజీ కాంబినేష‌న్ అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం అన్నారు. ఈ సినిమా కథ, పాత్రల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటూ ప్ర‌తి ఒక్క‌రిని ఖ‌చ్చితంగా అల‌రిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉందని చెప్పారు. మే 22న విడుద‌ల‌య్యే ఈ సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Leave A Reply

Your Email Id will not be published!