జూన్ 3న ముహూర్తం డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ స్వీకారం

అధికారపార్టీ వైపు నుండి ప్రక్రియ పూర్తి చేసింది

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. ఇప్ప‌టికే అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ హైక‌మాండ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మూడు సంవ‌త్స‌రాల పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా సిద్ద‌రామ‌య్య బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కానీ అనుకోకుండా డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివ‌కుమార్ త‌న ప‌క్క‌లో బ‌ల్లెంలా మార‌డంతో గ‌త్యంత‌రం లేక త‌ను సీఎం ప‌ద‌విని త్యాగం చేయాల్సి వ‌చ్చింది. దీంతో పార్టీ అధిష్టానం సైతం త‌న వైపు మొగ్గు చూపింది. ఇక లాంఛ‌న ప్రాయంగా మారింది సీఎం ప‌ద‌వి. ఇందుకు సంబంధించి బెంగ‌ళూరు వేదిక‌గా ఏఐసీసీ దూత‌లు గా వ‌చ్చిన కేసీ వేణుగోపాల్, నూర్జేవాలా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సీఎల్పీ కీల‌క స‌మావేశం జ‌రిగింది. త‌మ పార్టీ అధినేత‌గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం గా ఉన్న డీకే శివ‌కుమార్ ను త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు ఏక‌గ్రీవంగా .

ఇక కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి అధికారపార్టీ వైపు నుండి ప్రక్రియ పూర్తి చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయడం.. గవర్నర్ కు సమర్పించడం.. గవర్నర్ ఆమోదం తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ ను తదుపరి సీఎం గా ఆమోదిస్తూ తీర్మానం చేసి ఎన్నుకోవడం..అంతా పూర్తయింది..సిద్ధరామయ్య డీకెఎస్ కలిసి వెళ్ళి గవర్నర్ ను కలిసి సిఎల్పీ మీటింగ్ వివరాలు.. ఆయనకు వివరించి ఎన్నిక కాపీలను అందచేశారు.

దీంతో గవర్నర్ కూడా ఆమోదిస్తూ తదుపరి ముఖ్యమంత్రిగా శివకుమార్ ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..జూన్ 3న సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవ ముహూర్తం నిర్ణయించినట్లుగా పేర్కొంటూ గవర్నర్ శివకుమార్ కు ఆహ్వాన పత్రం అందచేశారు .మొత్తానికి ప్రభుత్వం వైపు నుండి.. గవర్నర్ వైపు నుండి అన్ని ప్రక్రియలు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!