స్మార్ట్ స్టోర్ గా గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్ : సీఎండీ

ఆక‌స్మిక త‌నిఖ చేసిన శివశంకర్ లోతేటి

నెల్లూరు జిల్లా : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని గోదాముల్లో విద్యుత్ పరికరాల నిర్వహణ కీలకమని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. నెల్లూరు సర్కిల్ పరిధిలోని గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షెడ్ లను సిఎండి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఎండి మాట్లాడుతూ స్టోర్స్ లో విద్యుత్ పరికరాల నిర్వహణను క్రమ పద్ధతిలో చేప‌ట్టాల‌న్నారు. వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన మెటీరియల్ ను సకాలంలో అందించాల్సిన బాధ్యత స్టోర్స్ అధికారులపై ఉంటుందని తెలిపారు. గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్ ను స్మార్ట్ స్టోర్ గా రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెటీరియల్ నిర్వహణలో అలసత్వం, అక్రమాలు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లయితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్టోర్ లోని ఏ బి కేబుల్, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్స్, బ్రేకర్స్, క్యూబికల్స్, ఎర్త్ పైప్స్, కండక్టర్ తదితర పరికరాలను పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టోర్స్ నుంచి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ రిజిష్ట‌ర్ల‌ను పక్కాగా నిర్వహించాలని సూచించారు. పరికరాలు నిరుపయోగం కాకుండా వాటిని క్రమ పద్ధతిలో వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎండీ.

స్టోర్స్ లో ఉన్న వివిధ పాత పరికరాలను టెండరు ప్రక్రియ ద్వారా ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చర్యలు చేపట్టాలని సిఎండి శివశంకర్ లోతేటి సూచించారు. అదేవిధంగా పరికరాల నిర్వహణకు రెండు నెలల్లోగా ప్లాట్ ఫామ్ ను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక స్టోర్స్ లో పనిచేస్తున్న కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం గూడూరు డివిజనల్ కార్యాలయంలో అధికారులతో వివిధ అంశాలపై సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్ , హెచ్ఆర్డి) కే. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్. రమణ, సూపరింటెండింగ్ ఇంజనీర్లు డి. తిరుమలరావు, వి. చంద్రశేఖర రావు, కే. రాఘవేంద్రం, జనరల్ మేనేజర్లు పివి సుబ్బారావు, సిహెచ్ నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బాల చంద్రబాబు, నరేంద్ర, శ్రీధర్, లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!