డీఎస్పీ భీమ్ రెడ్డి రిమాండ్ లో కీల‌క అంశాలు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అవినీతి నిరోధ‌క శాఖ‌

హైద‌రాబాద్ : ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా అక్ర‌మాస్తుల‌ను క‌లిగి ఉన్న డీఎస్పీ భీమ్ రెడ్డి సంచ‌ల‌నంగా మారాడు. త‌న‌ను అవినీతి నిరోధ‌క శాఖ ఆధ్వ‌ర్యంలో వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. క‌ళ్లు చెదిరే ఆస్తులు, లెక్క‌కు మించిన నోట్ల క‌ట్ట‌లు, అంతులేని ఆభ‌ర‌ణాలు, కోట్లాది విలువైన నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట ప‌డ్డాయి. ఈ సంద‌ర్బంగా భీమ్ రెడ్డి రిమాండ్ లో కీల‌క అంశాలు ప్ర‌స్తావించింది ఏసీబీ. సోదాల సమయంలో భీమ్ రెడ్డి ఇంట్లో రెండు మెమొరి కార్డ్స్ స్వాధీనం చేసుకుంది. మెమొరి కార్డ్స్ లో ఉన్న వివరాల ఆధారంగా ఆస్తుల డాక్యుమెంట్స్ గుర్తించింది. భీమ్ రెడ్డి దగ్గర ఒక డైరీ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది ఏసీబీ.మనకు ఇవ్వాల్సిన వాళ్ళు అంటూ ఒక్క ఫోటో ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది ఏసీబీ. నేను ఇవ్వవాల్సినవి అంటూ మరో పేజీలో తన అప్పులను రాసుకున్నాడు భీమ్ రెడ్డి.

మార్కెట్ వాల్యూ ప్రకారం భీమ్ రెడ్డి ఆస్తులు విలువ 300కోట్లు పైగా ఉంటుందని అంచ‌నా వేసింది. ప్రస్తుతం ఉంటున్న విల్లా ఎలా కొనుగోలు చేశారనే దానిపై సమాధానం ఇవ్వ‌లేద‌ని ఆరోపించింది. అక్రమాస్తులు కుడబెట్టడంలో భీమ్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించాడని పేర్కొంది. మొదట తన పేరు మీద ఆస్తులను కొనుగోలు చేసి వాటిని బినామిల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాడని వెల్ల‌డించింది.
బినామీలు ఎప్పుడైనా తిరగబడితే ప్రమాదం ఉందని ముందే ఊహించాడన‌ని తెలిపింది. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కాన్సిల్ చేసి మళ్ళీ బినామీ పేర్ల మీదికి మారుస్తాడని, ముందుగానే బినామిల దగ్గర నుంచి క్యాన్సిలేషన్ డీడ్ లను తీసుకొని భీమ్ రెడ్డి పెట్టుకున్నాడ‌ని పేర్కొంది ఏసీబీ.

క్యాన్సిలేషన్ డీడ్ ద్వారా బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను అనుభవిస్తున్నాడ‌ని, సోదాలు జరుగుతున్న సమయంలో భీమ్ రెడ్డి శ్వాస సంబంధిత సమస్య తో ఇబ్బంది పడ్డారని తెలిపింది. భీమ్ రెడ్డి ఇంటి పక్కనే ఉన్న MBBS డాక్టర్ తో ప్రాథమిక చికిత్స అందించి హాస్పిటల్ తరలించాం స్ప‌ష్టం చేసింది ఏసీబ‌బీ . అక్కడ వైద్యులు బెడ్ రెస్ట్ సూచించారని, భీమ్ రెడ్డి బీపీ పరిస్థితి ఆధారంగా ట్రావెల్ చేయవద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారని పేర్కొంది. అందుకోసమే భీమ్ రెడ్డి ను అరెస్ట్ చేయలేదని తెలిపింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భీమ్ రెడ్డి కు బెడ్ రెస్ట్ ఇచ్చాం అన్నారు. సిటీ న్యూరోకు తరలించి కార్డియాలజిస్ట్ తో చికిత్స అందించామ‌ని తెలిపింది. విచారణ లో భీమ్ రెడ్డి మాకు సహకరించ లేద‌ని, అక్రమ ఆస్తులు గురించి నోరు మెదప లేద‌ని ఆరోపించింది. సోదాల్లో పది బ్యాంకు అకౌంట్ లు రెండు లాకర్ లు గుర్తించాం అని తెలిపింది.

Leave A Reply

Your Email Id will not be published!