మేధో మథన కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్ర‌బాబు

అమరావతి : రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. రొయ్యల మేతకు వినియోగించే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగటం ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కారణంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. లక్షలాది మంది రైతులు, కార్మికులు, ప్రాసెసింగ్ కేంద్రాలు, ఎగుమతి దారులు, హేచరీలు, మేత తయారీ దారులు ఇతర అనుబంధ రంగాలకు ఆక్వా పరిశ్రమ ఉపాధి కల్పిస్తోందని సీఎం వివరించారు.

మేత లభ్యతలో చిన్న అంతరాయం కూడా ఆక్వా రైతుల మనుగడ, ఎగుమతులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోందని తెలిపారు. రొయ్య మేత తయారీదారుల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో రొయ్య మేత ధరలు భారీగా పెరిగాయని ఫలితంగా ఉత్పత్తి వ్యయం 20 శాతం కంటే ఎక్కువగా పెరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ఫిష్ మీల్ టన్ను రూ.1.55 లక్షల నుంచి రూ.2.40 లకు పెరిగిందని, అలాగే చేప నూనె టన్ను రూ.2.80 లక్షల నుంచి రూ.4.40 లక్షలకు, సోయా లెసిథిన్ టన్నుకు రూ.68 వేల నుంచి రూ.1.10 లక్షలకు చేరిందన్నారు. రొయ్యల మేతకు సంబంధించి ఈ ముడిపదార్ధాల భారం టన్నుకు రూ.25 వేల వరకూ పెరిగినట్టు సీఎం కేంద్రమంత్రికి వివరించారు. రొయ్యలు, ఆక్వాకల్చర్ ఉత్పత్తులకు సంబంధించి దేశీయ మార్కెట్ ను ప్రోత్సహించటం, ఎఫ్‌పీఓల ఏర్పాటు, మార్కెట్‌తో ఆక్వా రైతుల అనుసంధానం, దేశీయ మార్కెట్లలో బ్రాండింగ్, ప్రాసెసింగ్, రీటైల్ ధరల ఏకీకరణకు మద్దతు ఇవ్వటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ హెచ్చుతగ్గుల నుంచి ఈ రంగానికి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. దీని కోసం ఓ సంస్థాగత ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ తో ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రోడ్యూసర్స్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్ఎఫ్ డీబీ ద్వారా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!