ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా ప్ర‌భాస్ : వంగా

భిన్న‌మైన షెడ్యూల్ లో చిత్రీక‌రిస్తున్నాం

హైద‌రాబాద్ : కేవ‌లం కొన్ని సినిమాల‌తోనే త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ డైన‌మిక్ ఇమేజ్ స్వంతం చేసుకున్న విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి. త‌ను తీసిన అర్జున్ రెడ్డి సూప‌ర్ . ఆ త‌ర్వాత హిందీలో తీసిన రెండు చిత్రాలు సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తీవ్ర నిరాశ‌లో కూరుకు పోయిన బాబీ డియోల్ కు అద్భుత‌మైన పాత్ర‌తో మ‌ళ్లీ బ‌తికించేలా, త‌న‌కు సినిమాల‌లో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు వంగా సందీప్ రెడ్డి. ప్ర‌స్తుతం త‌ను పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ గా పిలుచుకునే ప్ర‌భాస్ స్పిరిట్ తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్స్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. త‌న‌ను ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ బోతున్న‌ట్లు చెప్పాడు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈ పాత్ర ఉండ‌బోతోంద‌ని పేర్కొన్నాడు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ , వంగా సందీప్ రెడ్డిల కాంబోపై భారీ ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి.

స్పిరిట్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేశామ‌న్నాడు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం షూటింగ్ ఒక విభిన్నమైన షెడ్యూల్ పద్ధతిలో జరుగుతోందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ‘అర్జున్ రెడ్డి, ‘యానిమల్’ చిత్రాల భారీ విజయాల తర్వాత, వంగా తదుపరి చిత్రంపై టాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఒక సంభాషణలో దర్శకుడు ‘స్పిరిట్’ షూటింగ్ , ప్రణాళికకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. ‘స్పిరిట్’ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని సందీప్ రెడ్డి వంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని ఒక విభిన్నమైన షెడ్యూల్ పద్ధతిలో చిత్రీకరిస్తున్నట్లు కూడా వెల్లడించారు. చిత్ర బృందం దాదాపు ఐదు రోజుల పాటు నిరంతరాయంగా షూటింగ్ జరిపి, ఆ తర్వాత దాదాపు ఒక నెల రోజుల పాటు విరామం తీసుకోవాలని యోచిస్తోందని చెప్పాడు. ఈ సుదీర్ఘ విరామాలు సన్నివేశాల నాణ్యతపై దృష్టి పెట్టడానికి, పోస్ట్-ప్రొడక్షన్ పనులపై శ్రద్ధ వహించడానికి , తదుపరి షూటింగ్ షెడ్యూల్‌ను క్షుణ్ణంగా ప్లాన్ చేయడానికి బృందానికి తగిన సమయాన్ని ఇస్తాయని వంగా వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!