విజయ్ పోటీ చేస్తే కేరళ సీఎం కావ‌డం ఖాయం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స్వామి జ్ఞాన తీర్థ

చెన్నై : ప్రజలకు సమర్థవంతంగా సేవ చేయడానికి దైవానుగ్రహం కోరడం పట్ల స్వామి జ్ఞాన తీర్థ విజయ్‌ను ప్రశంసించారు. దైవానుగ్రహానికి తగిన గౌరవం ఇవ్వని గత తమిళనాడు ప్రభుత్వంతో దీనిని ఆయన పోల్చి చెప్పారు. కొడైకెనాల్‌లోని శ్రీ నారాయణ గురు ఆశ్రమానికి చెందిన స్వామి జ్ఞాన తీర్థ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్ర‌శేఖ‌ర్ కేరళలో ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తారని జోష్యం చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ కేరళ ప్రజలు విజయ్‌ను కేవలం ఒక నటుడిగా కాకుండా, ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

నిజంగా విజ‌య్ గ‌నుక అక్క‌డ‌ పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తారని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు జ్ఞాన తీర్థ. జోసెఫ్ విజయ్ రాజకీయ పార్టీ ఇప్పటికే తన కార్యకలాపాలను ప్రారంభించిందని అన్నారు. కేరళ అంతటా అనేక కార్యాలయాలను తెరిచిందని ఆయన పేర్కొన్నారు; ముఖ్యంగా పాలక్కాడ్, కోజికోడ్, వయనాడ్ జిల్లాలతో పాటు తిరువనంతపురం సమీప ప్రాంతాలను ఆయన ప్రస్తావించారు. ప్రజలకు సమర్థవంతంగా సేవ చేయడానికి దైవానుగ్రహం కోరడం పట్ల విజయ్‌ను ఆయన ప్రశంసించారు. అలాగే విజయ్ , వి.డి. సతీశన్ (కేరళ ముఖ్యమంత్రి) ఇద్దరూ తమ బాధ్యతలు చేపట్టే ముందు నారాయణ గురు ఆశీస్సులు కోరారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా జ్ఞాన తీర్థ సీఎం విజ‌య్ గురించి చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి ఆద్యాత్మిక‌, రాజ‌కీయ రంగాల‌లో.

Leave A Reply

Your Email Id will not be published!