ఎల్ఐసీ జీవ‌న్ ధారా జీవితాంతం భ‌రోసా

ఒకేసారి పెట్టుబడి జీవితాంతం ఆదాయం

హైద‌రాబాద్ : జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) రోజు రోజుకు కొత్త కొత్త పాల‌సీలు తీసుకు వ‌స్తోంది. తాజాగా తీసుకు వ‌చ్చిన జీవ‌న్ ధారా – II (ప్లాన్ 892) మంచి ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. ఈ ప్లాన్ లో ఎంట్రీ వయసు 18 సంవత్సరాలైతే గరిష్ట వయో పరిమితి 69 సంవత్సరాలు. అంటే ఒక వ్యక్తి సింగిల్ ప్రీమియం కనీసం రూ. 2 లక్షల 16000 నుంచి గ‌రిష్టంగా ఎన్ని కోట్లు అయినా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. దీనికి ఎలాంటి ప‌రిమితి లేదు. పెన్ష‌న్ డ‌బ్బులు చెల్లించడం ద్వారా తన 19 వ సంవత్సరం నుంచే స్థిరమైన పెన్షన్ జీవితాంతం పొందే అవకాశం ఇందులో ఉంది. పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయం కావాలనుకునే వారికి, చేతిలో ఉన్న పొదుపుతో క్రమబద్ధమైన పెన్షన్ పొందాలని భావించే వారికి ఎల్ఐసీ న్యూ జీవన్ ధారా-II ఒక గొప్ప అవకాశం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ పెన్షన్ ప్లాన్ లో ఎంచుకున్న ఆప్షన్ నిబంధనల ప్రకారం జీవితాంతం యాన్యుటీ ఆదాయం (పెన్షన్) తో పాటు, కొనుగోలు ధరను నామినీకి తిరిగి అందించే సదుపాయం కూడా ఉంది.

కేవలం పొదుపు చేయడం మాత్రమే కాదు. భవిష్యత్తులో క్రమమైన ఆదాయం, కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం కూడా ముఖ్యం. ఆ లక్ష్యంతో ఈ ప్లాన్‌ను పరిశీలించవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం.. మన దగ్గర ఉన్న సొమ్ముని కుటుంబ ఆస్తిగా ఇది మారుస్తుంది. అంటే ఈ పెన్షన్ మనతో అంటే ప్రారంభ పోలసీదారుడితోనే ఆగిపోదు.. మరో కుటుంబ సభ్యునితో కూడా ఇది కొనసాగుతుంది . జాయింట్ లైఫ్ ఎంపిక ద్వారా కూడా కొన‌సాగుతుంది. భ‌రోసా ఇస్తుంది ఆర్థికంగా. ఒకేసారి రూ. 10 ల‌క్ష‌లు ఇన్వెస్ట్ చేస్తే . నెల వారీగా పెన్ష‌న్ రూ. 5,016 వ‌స్తుంది. 12 నెల‌ల‌కు ఒకేసారి అయితే రూ. 60,192 . ఒక సంవత్సరం తర్వాత పెన్షన్ మొదలవుతుంది. కావాలంటే మరో సంవత్సరం డిఫెర్మెంట్ పెట్టుకోవచ్చు. అప్పుడు పెన్షన్ 64000 వస్తుంది.

Leave A Reply

Your Email Id will not be published!