అప్ డేట్ కాక‌పోతే వెనుక‌బ‌డి పోతాం : స‌త్య నాదెళ్ల

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన టెక్ దిగ్గ‌జ సంస్థ సీఈఓ

వాషింగ్ట‌న్ : తెలుగు వాళ్ల‌కు ముఖ్యంగా భార‌తీయుల‌కు గ‌ర్వ కార‌ణంగా నిలిచిన టెక్ దిగ్గ‌జాల‌లో ఒక‌డు మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య నాదెళ్ల‌. ఆయ‌న ఈ మ‌ధ్య కాలంలో ఎప్ప‌టిక‌ప్పుడు టెక్నాల‌జీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. టెక్నాల‌జీ రంగంలో రాణించాల‌న్నా, ఆవిష్క‌ర‌ణ‌లు చోటు చేసుకోవాల‌న్నా, ఆర్ అండ్ బి ముందుకు సాగాల‌న్నా అప్ డేట్ కావాల్సిందేన‌ని పేర్కొన్నారు. లేక‌పోతే మ‌నుగ‌డ సాగించ‌డం, ముందుకు వెళ్ల‌డం చాలా క‌ష్ట‌మ‌న్నాడు స‌త్య నాదెళ్ల‌. ఒక ర‌కంగా ఏఐ డామినేష‌న్ చేస్తున్న ఈ త‌రుణంలో సీఈఓ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌కు దారితీసేలా చేశాయి. అన్నీ నేర్చుకోండి అనేది త‌మ సంస్థ ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నాడు. ఇదే మైక్రోసాఫ్ట్ ను మిగ‌తా టెక్ కంపెనీల కంటే భిన్నంగా ఉండేలా చేసింద‌న్నాడు స‌త్య నాదెళ్ల‌.

సాంకేతికత నిరంతరం మారుతున్నప్పుడు ప్రజలు దానికి అనుగుణంగా మారడానికి సంసిద్దులై ఉండాల‌ని స్ప‌ష్టం చేశాడు. ఇక సత్య నాదెళ్ల చాలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. మైక్రో సాఫ్ట్ లో కీల‌క ప‌ద‌వి చేప‌ట్టాడు. ఆ సంస్థ‌ను టాప్ లోకి తీసుకు వెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యారు . ఆనాటి నుంచి నేటి దాకా ఎన్నో మార్పులు తీసుకు వ‌స్తూనే ఉన్నారు. నేర్చుకునే వాళ్ల‌కు ముఖ్యంగా ఆవిష్క‌ర్త‌ల‌కు ఆయ‌న తివాచీ ప‌రిచారు. ప్ర‌స్తుతం మైక్రోసాఫ్ట్ మారుతున్న పరిశ్రమలో ఉంది. తిరిగి ఊపందు కోవడానికి కష్టపడుతోంది. సత్య నాదెళ్ల మొదటి ప్రధాన ప్రాధాన్యత కేవలం ఉత్పత్తులను లేదా వ్యూహాన్ని మార్చడం కాదు, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ పనిని ఎలా చేస్తారో పునరాలోచించడం నేర్చుకోవాల‌ని పేర్కొన్నాడు సీఈఓ. తాజాగా త‌న స‌హ ఉద్యోగులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇచ్చాడు. మీరు ఉన్న‌తంగా, భిన్నంగా ఆలోచించండి. అంతే కాదు ఎప్ప‌టిక‌ప్పుడు నేర్చుకుంటూనే ఉండండి అని పేర్కొన్నాడు.

Leave A Reply

Your Email Id will not be published!