సోనియా గాంధీ పౌర‌స‌త్వంపై కంగ‌నా ర‌నౌత్ ఫైర్

15 సంవ‌త్స‌రాల పాటు ఎందుకు ఆగార‌ని ఆగ్ర‌హం

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, ప్ర‌ముఖ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మ‌రోసారి సోనియో గాంధీని టార్గెట్ చేశారు. త‌న పౌర‌సత్వం గురించి ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి 15 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారని కంగనా రనౌత్ నిల‌దీశారు. రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న 15 సంవత్సరాల తర్వాత,అంటే 1983లో సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడాన్ని ప్ర‌స్తావించారు. బుధ‌వారం కంగ‌నా మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వం, ప్రముఖ కుటుంబ సభ్యుల మరణాలు, మేనకా గాంధీని పార్టీ నుండి బహిష్కరించారనే ఆరోపణలపై కూడా ఆమె వివాదాస్పద ఆరోపణలు చేశారు.

1980లో సంజయ్ గాంధీ మరణంతో ముడిపెడుతూ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ అనే ఆత్మకథతో ముందుకు వచ్చారు సోనియా గాంధీ. వివాహం జరిగిన 15 సంవత్సరాల తర్వాత పౌరసత్వం ఎందుకు పొందారని ప్రశ్నించారు. సోనియా గాంధీకి 1968లో వివాహం జరిగింది. సోనియా గాంధీ ప్రధానమంత్రి నివాసంలో నివసించారు, పౌరసత్వం లేకుండా ఓటు వేశారు, కానీ 15 సంవత్సరాల వరకు భారత పౌరసత్వం పొందలేదు. 1980లో సంజయ్ గాంధీ మరణించారు, 15 సంవత్సరాల తర్వాత 1983లో సోనియా గాంధీ భారత పౌరసత్వం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందిరా గాంధీ రాజకీయ వారసుడు మరణించిన తర్వాతే ఆమె ఎందుకు పౌరసత్వం పొందారనే విష‌యంపై దేశ ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కంగ‌నా ర‌నౌత్.

‘రహస్య విదేశీయురాలు’ అయిన సోనియా గాంధీ రాజకీయ ఎదుగుదలను ప్రశ్నించింది. తన ‘ఎమర్జెన్సీ’ సినిమా కోసం గాంధీ కుటుంబంపై చాలా పరిశోధన చేశానని, సోనియా గాంధీ రాక తర్వాత, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారసులందరూ ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో, కేవలం తానొక్కదాన్నే ఏకైక ఎంపికగా మిగలడం తనకు వింతగా అనిపించిందని కంగనా పేర్కొన‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!