కాలం కంటే వేగంగా ప‌ని చేస్తున్న చంద్ర‌బాబు నాయుడు

ప్రశంస‌లు కురిపించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గోయ‌ల్

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏళ్లు గ‌డిచినా ఆయ‌న పోటీ ప‌డి ప‌ని చేస్తున్నార‌ని, అంత‌కంటే ఎక్కువ‌గా ఆయ‌న కాలం కంటే ముందుగా ప్ర‌యాణం చేస్తున్నారంటూ ప్ర‌శంస‌లు కురిపించారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్. గురువారం విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ప్రారంభ‌మైన సీఐఐ స‌మ్మిట్ 2026లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం సీఐఐ భాగస్వామ్య సదస్సుకు శాశ్వత వేదికగా మారుతోంద‌ని అన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు గోయ‌ల్. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుందని, పెట్టుబడుల సదస్సు కూడా దేశ వాణిజ్యాన్ని వృద్ధి చేస్తోందని చెప్పారు. ఇటీవలే రెండు తుఫాన్లు ఏపీ తీరాన్ని తాకినా, మ‌రో వైపు విధ్వంసం సృష్టించినా అపార న‌ష్టం జ‌రిగినా వెంట‌నే విశాఖ‌న‌గ‌రం కోలుకుంద‌ని కితాబు ఇచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తల్ని, ఆయా దేశాల రాయబారులను, ప్రతినిధుల్ని ఆహ్వానించడం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు ప‌డిన కృషిని కొనియాడారు. కాలం కంటే ముందు ఆలోచన చేసి ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీల గురించి మాట్లాడిన వ్యక్తి చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు పీయుష్ గోయ‌ల్.
అంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అమలు చేస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేలా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించేందుకు ఎస్క్రోఖాతాను ఏపీ ప్రారంభించింద‌ని చెప్పారు. 2024లో సీఎం చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు రాష్ట్రానికి పెద్ద ఎత్తున అప్పులు, విధ్వంసమైన వ్యవస్థలు ఆయన చేతికి వచ్చాయన్నారు. అయినా ఏపీని వేగంగా పునరుద్ధరించి వ్యవస్థలను చక్కదిద్దుతూ పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేశార‌న్నారు.

స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు విధానంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు పీయూష్ గోయ‌ల్. ఆర్ఆర్ఆర్ సినిమాలో లా సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ నీరు, నిప్పులా అభివృద్ధి కోసం పని చేస్తున్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం, సవాళ్లు, పోటీ నెలకొన్నాయి. ఇలాంటి విపత్కర సమయంలోనే పెట్టుబడిదారులకు భారత్ భరోసాగా నిలుస్తోందని అన్నారు. అప్పట్లో ఆంధ్ర ప్రాంత పాలకుడైన కాకతీయ రాజు గణపతి దేవుడు అప్పట్లోనే విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా కొన్ని శాసనాలు చేశారని వెల్ల‌డించారు. అప్పుడూ ఇప్పుడూ భారత్ విదేశీ పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!