24 ఏళ్లు పూర్తి చేసుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్

ఘనంగా వేడుకలు జరుపుకుంటున్న అభిమానులు

హైద‌రాబాద్ : అభిమానుల ఆరాధ్య దైవం రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న సినీ కెరీర్ లో నేటితో 24 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా త‌న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు. వేడుక‌లు జ‌రుపుతున్నారు. ప్ర‌భాస్ త‌న సినీ ప్ర‌స్థానం ‘ఈశ్వర్’ చిత్రంతో మొదలైంది. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా పాన్ ఇండియా స్థార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’ ‘సలార్ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ సినీ పరిశ్రమలో 24 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక మైలురాయి. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఆయన సాగించిన ఈ ప్రయాణం ఎంతో విశేషమైనది. ‘ఈశ్వర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ప్రభాస్ ఆ తర్వాత వరుస విజయాలతో అగ్రశ్రేణి నటుడిగా ఎదిగారు. ‘బాహుబలి’తో పాన్-ఇండియా స్థాయికి చేరుకున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయికి విస్తరిస్తోంది.

2002 నవంబర్ 11న విడుదలైన ‘ఈశ్వర్’ చిత్రంతో ప్రభాస్ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ తేదీ ఆయన అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 24 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు ఈ సందర్భాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికలన్నీ ప్రభాస్ ప్రస్థానాన్ని గుర్తు చేసే ప్రత్యేక పోస్టర్లు, డిస్‌ప్లే పిక్చర్లు , అభినందన సందేశాలతో నిండిపోయాయి. అభిమానులు, ప్రేక్షకుల అపారమైన ప్రేమ , మద్దతుతో ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాలతో తన కెరీర్‌ను మరింత విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘ఫౌజీ’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మాణంలో ‘కల్కి 2’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో ‘సలార్ 2’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘ఫౌజీ’ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుండగా, ‘స్పిరిట్’ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ప్రస్తుతం ‘కల్కి 2’ షూటింగ్ కొనసాగుతుండగా, ‘సలార్ 2’ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇలా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ప్రభాస్ తన రాబోయే చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో నిరంతరం ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!