చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన దర్శకులలో ఒకరు నెల్సన్ దిలీప్ కుమార్ . తన జర్నీ మామూలుగా సాగలేదని తనతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన మరో దర్శకుడు రాజ్ కుమార్ పెరియ స్వామి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ 2009లో తన తొలి సినిమాపై పని ప్రారంభించారు. ఆ సినిమా 2018లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఆయన మొదట పనిచేసిన సినిమాకు, చివరకు థియేటర్లలోకి వచ్చిన సినిమాకు మధ్య చాలా పెద్ద విరామం ఏర్పడింది. ఆ కష్టాలన్నింటినీ అధిగమించి ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం అంత సులభం కాలేదని తెలిపాడు పెరియస్వామి. నేను ఆయన తొలి సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూశాను. ఆ సినిమాకు టీజర్ కూడా రూపొందించారు. అందులోని ఓ పాత్రకు నేను డబ్బింగ్ కూడా చెప్పాను.
ఆ సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. అందులో చాలామంది యాక్టర్లు నటించారు. దురదృష్ట వశాత్తూ ఆ సినిమా పూర్తికాలేదు, విడుదలకు కూడా నోచుకోలేదు. దాదాపు నాలుగైదేళ్ల పాటు సినిమా పూర్తి కావడానికి మరో 8–10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని చెబుతూనే వచ్చారు. సినిమాకు సంబంధించిన ఫుటేజ్, ఇతర మెటీరియల్ అంతా నెల్సన్ తన కారులో ఉంచుకునే ఓ ల్యాప్‌టాప్‌లో భద్రపరిచారు. అయితే ఒకసారి ప్రయాణం మధ్యలో ఎక్కడో ఆగినప్పుడు ఆ ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. ఇలా తన ప్రయాణంలో నెల్సన్ ఎన్నో కష్టాలు, అడ్డంకులను ఎదుర్కొన్నారని తెలిపారు దర్శకుడు రాజ్ కుమార్ పెరియ స్వామి. ప్రతి జర్నీ వెనుక తెలియని కష్టం ఉంటుందని పేర్కొన్నారు.