డిసెంబ‌ర్ రెండ‌వ వారంలో ‘మెగా వ‌ర్స్’ ఎపిసోడ్

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంస్థ‌లో స్ట్రీమింగ్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోగా కొన‌సాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న న‌టుడిగానే కాకుండా హోస్ట్ గా కూడా గ‌తంలో నిర్వ‌హించారు. తాజాగా ఆయ‌న‌కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇప్ప‌టికే యాంక‌ర్స్ గా అత్యంత జ‌నాద‌ర‌ణ పొందారు అక్కినేని నాగార్జున‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌. నాగార్జున బిగ్ బాస్ రియాల్టీ షో యాంక‌ర్ గా ఉండ‌గా నాన్ స్టాప‌బుల్ విత్ బాల‌య్య (ఎన్బీకే) తో రియాల్టీ షో కొన‌సాగుతోంది. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ షో కోసం ప్లాన్ చేసింది. దాని పేరు మెగా వ‌ర్స్. ఈ షో పూర్తిగా సెలబ్రిటీ టాక్ షోతో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ షోపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ షో షూటింగ్ జరుగుతోంది, ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. మొదట దీపావళికి మొదటి ఎపిసోడ్‌ను విడుదల చేయాలని భావించినప్పటికీ అది సాధ్య పడలేదు.తాజా సమాచారం ప్రకారం ‘మెగావర్స్’ మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 2026 రెండవ వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ లేదా షో నిర్వాహకుల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ షోలో చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సంభాషించనున్నారు. పలువురు అగ్రశ్రేణి నటులు , సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

మీడియా కథనాల ప్రకారం ప్రభాస్ ఈ షోలో పాల్గొనే అవకాశం ఉండగా నాగార్జున , ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే తమ ఎపిసోడ్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం.ఇప్పుడు అభిమానులు నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక విడుదల తేదీ ప్రకటన కోసం , ‘చిరంజీవిస్ మెగావర్స్’ మొదటి ప్రోమో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!