స‌ర్వాంగ సుందరంగా ముస్తాబైన త‌మ్మిడికుంట

ఆటపాటలతో సందడి చేసిన‌ చిన్నారులు

హైద‌రాబాద్ : హైడ్రా ద్వారా సుందరమైన ప్రాంతంగా రూపుదిద్దుకున్న తమ్మిడికుంట చెరువు అంత‌ర్జాతీయ బాలల దినోత్సవ వేడుకలకు వేదికైంది. ఇది పిల్లలు ఉత్సాహంగా గడిపేందుకు ఒక చక్కని ప్రదేశంగా మారింది. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బాలల దినోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. వారంతా నేరుగా తమ్మిడికుంటకు చేరుకున్నారు. బాలానగర్‌లోని వ్యాక్సెన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సుమారు 270 మంది విద్యార్థులు ఇక్కడి ప్లే ఏరియాలో సందడి చేశారు. వారు ఓపెన్ జిమ్‌లో ఆడుకుంటూ ఎంతో ఆనందించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పార్కులను అన్వేషించడమే కాకుండా సరస్సు గట్టున ఉన్న నడక మార్గాల్లో నడిచారు. గెజిబో (gazebo) వద్ద ఉన్న బోన్సాయ్ మొక్కల పక్కన కూర్చుని, సరస్సు గురించి తెలుసుకున్నారు. పునరుద్ధరణకు ముందు తమ్మిడికుంట ఎలా ఉండేది, హైడ్రా దీనిని ఎలా అభివృద్ధి చేసింది, పనులు జరుగుతున్నప్పుడు ఇది ఎలా కనిపించింది అనే విషయాలను తెలిపే ఫోటో ప్రదర్శనను పిల్లలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తమ్మిడికుంటను ప్రారంభించగా, ఆ తర్వాత ఇక్కడ సందర్శించిన వారిలో ఈ చిన్నారులే ముందున్నారు.

తమ్మిడికుంట అభివృద్ధికి అవసరమైన డీపీఆర్ (ను రూపొందించిన ‘విమోస్ టెక్నోక్రాట్స్’ సంస్థ డైరెక్టర్ యూనస్ పర్వేజ్ ఈ సరస్సును ఎలా అభివృద్ధి చేశారో పిల్లలకు వివరించారు. అలాగే పిల్లలు మొక్కలు నాటాలని, నీటిని వృథా చేయకూడదని ఆయన సూచించారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు విశ్రాంతి తీసుకునేందుకు గెజిబోలు, ఆడుకోవడానికి ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్‌లు ఉన్నాయి. ఇక్కడ అన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయబడ్డాయి. సరస్సులను పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచి పోతారని పేర్కొన్నారు. తమ్మిడికుంటను ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు హైడ్రాకు, అలాగే ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అని వ్యాక్సెన్ పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గతంలో ఇక్కడ దుర్వాసన భరించలేక ఎవరూ అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని వారు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!