ఏడాదిలో విశాఖలో సినీ నిర్మాణ కార్యకలాపాలు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన న‌టుడు ద‌గ్గుబాటి రానా

అమ‌రావ‌తి : ప్ర‌ముఖ న‌టుడు దగ్గుబాటి రానా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన సీఐఐ స‌ద‌స్సు -2026లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సినిమా రంగానికి సంబంధించి. ప్ర‌స్తుతం త‌ను అగ్ర న‌టుల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నారు. రాబోయే ఏడాదిలో విశాఖపట్నంలో తమ సంస్థ తరఫున సినీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని నటుడు రానా చెప్పారు. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ అని ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మ‌మి ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని ప్ర‌క‌టించారు. ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలతో పాటు ప్రపంచానికి ఇంకా పూర్తిగా పరిచయం కాని ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు.

వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ద‌గ్గుబాటి రానా. ఆ దిశగా మా వంతు బాధ్య‌త‌గా ప్రయత్నాలను కొనసాగిస్తాం వెల్ల‌డించారు. తెలుగు ప్రేక్షకులు ఇతర భాషలు, దేశాల సినిమాలను కూడా ఆదరిస్తార‌ని తెలిపారు. భారతీయ వినోద పరిశ్రమ ఆదాయంలో తెలుగు ప్రేక్షకుల వాటా దాదాపు 70 శాతంగా ఉంద‌న్నారు ద‌గ్గుబాటి రానా , భారత జనాభాలో తెలుగు ప్రజలు దాదాపు పదో వంతు మాత్రమే ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఆదరణ ఉండటం మన ప్రత్యేకత అన్నారు. కొరియా, జపాన్ తదితర దేశాల సినిమాలు, సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతోంద‌ని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ద్వారా దాదాపు 100 కోట్ల మంది భారతీయ ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉందన్నారు. బాహుబలి సినిమాను దేశవ్యాప్తంగా పరిచయం చేసిన‌ట్టే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథను ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని రానా పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!