మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రం వాయిదా నిజ‌మేనా..?

సోష‌ల్ మీడియాలో విడుద‌ల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ : మహేష్ బాబు కథా నాయకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సాహసాత్మక చిత్రం ‘వారణాసి’పై సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ అగ్ర దర్శకుడు రాజమౌళి కలిసి పని చేస్తుండటంతో, అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అనుకున్న తేదీకి సినిమా విడుదల కాకపోవచ్చు. వాయిదా పడే అవకాశం ఉంది.

‘వారణాసి’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశేషమేమిటంటే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. దీనితో ఆయన పుట్టినరోజు సందర్భంగానే సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందేమోనని చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులకు ఇది రెట్టింపు ఆనందాన్ని ఇస్తుందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒకే నెలలో ఆయన పుట్టినరోజు వేడుకలను , సినిమా విడుదలను వారు ఆస్వాదించవచ్చు. అయితే ఈ వాయిదా వార్తలపై చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఖచ్చితమైన విడుదల తేదీ తెలియాలంటే, చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your Email Id will not be published!