ధురంద‌ర్ రికార్డును అధిగ‌మించిన రామాయ‌ణం

ఏడు రోజుల్లోనే రూ. 935 కోట్ల‌కు పైగా వ‌సూలు

హైద‌రాబాద్ : రణబీర్ కపూర్, సాయి పల్లవిల రామాయణం బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది. విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 934.55 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఒక్క బుధవారం రోజే ఇది భారతదేశం అంతటా నికర వసూళ్లలో 70.65 కోట్ల రూపాయలను రాబట్టింది. ప్రముఖ ట్రేడ్ పోర్టల్ శాక్‌నిల్క్ ప్రకారం రామాయణం తన మొదటి వారంలోనే భారతదేశం అంతటా నికర వసూళ్లలో 511.10 కోట్లు, స్థూల వసూళ్లలో 611.05 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం విదేశీ మార్కెట్ల నుండి కూడా 323.5 కోట్లకు పైగా వసూలు చేసి, ప్రపంచ వ్యాప్తంగా దాని అద్భుతమైన బాక్సాఫీస్ ప్రదర్శనకు మరింత దోహద పడింది.

ప్రపంచ వ్యాప్త అద్భుతమైన వసూళ్లతో పాటు,రామాయణం కేరళ బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం ‘ధురందర్: ది రివెంజ్’ పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించి, రాష్ట్రంలో 20 కోట్ల గ్రాస్ మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ‘రామాయణ’ చిత్రం కేరళలో 20.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థియేటర్లలో విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది. ఈ విజయంత రాష్ట్రంలో ఇంతకు ముందు సుమారు 19.50 కోట్లు వసూలు చేసిన ‘ధురందర్ 2’ను ఈ చిత్రం అధిగమించింది.గతంలో అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ ‘దంగల్’ వంటి బాలీవుడ్ చిత్రాలు కేరళ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచాయి. అయిత ఇప్పుడు ‘రామాయణ’ తన బాక్సాఫీస్ రికార్డుల జాబితాలో మరో ముఖ్యమైన మైలురాయిని చేర్చుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!