హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లకు ఝలక్ ఇచ్చింది. కీలక పదవుల నుంచి తప్పించింది. వారి స్థానంలో మరికొందరిని నియమించింది. నిన్నటి దాకా వార్తల్లో నిలిచిన సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై వేటు వేసింది. ఆయనకు షాక్ ఇస్తూ తన స్తానంలో సిటీ పోలీస్ కమిషనర్ గా మహేష్ భగవత్ ను నియమించింది. రాష్ట్ర పోలీసు శాఖతో పాటు ఇతర కీలక ప్రభుత్వ సంస్థల్లో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ పోస్టింగ్‌ను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సజ్జనార్ నను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు.
డాక్టర్ సౌమ్య మిశ్రా మహిళలు మరియు భద్రత, షీ టీమ్స్ , భరోసా డిజిపిగా ,స్వాతి లక్రా జైళ్ల, కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి), సిఐడి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి), పౌర సరఫరాలు , ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విభాగాలకు సంబంధించిన మార్పులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. చారు సిన్హా తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. డీజీపీ, సీఐడీగా కూడా ఆమె అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డాక్టర్ అనిల్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్-ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. నాగి రెడ్డి ప్రభుత్వ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , పౌర సరఫరాల శాఖకు కమిషనర్, పౌర సరఫరాలు, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.అంతే కాకుండా పౌర సరఫరాల కార్పొరేషన్ వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ , లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
సంజయ్ కుమార్ జైన్ కు అదనపు డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్ గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ డీజీపీగా , పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. అకున్ సబర్వాల్ తెలంగాణ అదనపు లా అండ్ ఆర్డర్గా నియమితులయ్యారు. టెక్నికల్ సర్వీసెస్ (టి-స్పార్క్) ఎడిజిపి, కోఆర్డినేషన్ , ఎడిజిపిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. S. చంద్రశేఖర్ రెడ్డి అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కార్తికేయ, కె. రమేష్ నాయుడు, జోయల్ డేవిస్ , జి. చందన దీప్తి, ఆర్. భాస్కరన్, కె. నారాయణ నాయక్ , ఎల్ఎస్ చౌహాన్ , బాలా దేవి, అరవింద బాబు లకు కీలక బాధ్యతలు అప్పగించింది సర్కార్.
