AR Rahman : భారత దేశం గర్వించదగిన గాయని లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను యావత్ భారతావని జీర్ణించు కోలేక పోతోంది. భారతీయ సంస్కృతికి, సంగీతానికి, సినీ రంగానికి , దేశానికి ఆమె వారధిగా నిలబడ్డారు.
అందుకే ఆమె అంటే అంత గౌరవం. లతతో సంగీత దర్శకులుగా పని చేసిన వారే కాదు మూవీ రంగానికి చెందిన అన్ని రంగాలకు చెందిన వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
దిగ్గజ దర్శకుడు అల్లా రఖా రెహమాన్ (AR Rahman )అయితే తనకు మాటలు రావడం లేదన్నాడు. సామాజిక మాధ్యమాలలో తమ సంతాపాన్ని తెలిపారు.
ప్రేమ, గౌరవం నిండిన మహోన్నత మూర్తి ఆమెకు శాంతి కలుగు గాక అని ప్రార్థించాడు రెహమాన్.
ఇవాళ శూన్యంగా తోస్తోంది. అమ్మ లేక పోవడం బాధాకరం. స్వర కోకిల భారత రత్న
..లతా దీదీ మీ దివ్వ స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఓం శాంతి అంటూ పేర్కొంది శ్రేయా ఘోషల్.
పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీ అయితే ఇవాళ సంగీతం అనాధంగా మారిందని వాపోయాడు.
మా నైటింగేల్ ఎగిరి పోయింది. మేము చీకట్లో స్వరం లేకుండా ఉండి పోయామన్నాడు.
ఆమె కాలంలో జీవించి ఉన్నందుకు గర్వ పడుతున్నామని పేర్కొన్నాడు సమీ.
అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్ సైతం తీవ్ర విషాదాన్ని నింపారని వాపోయారు.
ఆమె ఆశీస్సులు నాకు ఎల్లప్పటికీ ఉంటాయన్నాడు సింగర్ షాన్. ఇది విషాదకరం. ఒక యుగానికి ముగింపు. లతాజీ భౌతికంగా లేక పోయినప్పటికీ ఆమె ఎల్లకాలం తన పాటతో బతికే ఉంటుందన్నారు గాయని చిన్మయి శ్రీపాద.
మా గాయనీ గాయకులందరికీ లతా దీదీ సరస్వతి అని వాపోయాడు కుమార్ సాను.
ఆమె చెరగని నవ్వు, ఎల్లకాలం గుర్తుంచుకునే స్వరం నేను ఎప్పటికీ మరిచి పోలేను అన్నాడు సింగర్ కంపోజర్ విశాల్ దద్లానీ.
గాత్ర సరస్వతీ లేదన్న నిజం జీర్ణించు కోలేక పోతున్నానని కన్నీటి పర్యంతం అయ్యాడు సురేష్ వాడ్కర్.
ఆమె స్వరంలో మ్యాజిక్ ఉంది. ఆమె పాటల ద్వరా తరాలు ఆశీర్వదించ బడతాయి అంటూ వాపోయాడు స్వరకర్త,
గిటారిస్ట్ ఎహ్సాన్ నూరానీ. లతాజీని చూసి పాడటం నేర్చుకున్నా.
నా గది నిండా ఆమె జ్ఞాపకాలతో ఉండి పోయాయి అని పేర్కొంది సింగర్ లిసా మిశ్రా.
మరో సింగర్ నేహా కక్కర్ అయితే లతా మంగేష్కర్ లాంటి ఎవరూ ఉండరని తెలిపింది.
Also Read : అరుదైన జ్ఞాపకం చిరస్మరణీయం