#SumanSayani : సుమన్ సాయని రోగుల పాలిట దేవత
ట్రైనర్ ..మెంటార్..కౌన్సెలర్..మోటివేటర్..డాక్టర్..సయాని
Suman Sayani: దేశంలో ఐటి రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ప్రాంతంగా హైదరాబాద్ దూసుకు వెళుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు లాజిస్టిక్ , హెల్త్ , ఈ కామర్స్ , టెలికాం , ఆయిల్ , ట్రాన్స్ పోర్ట్ , నిర్మాణ , రియల్ ఎస్టేట్ , తదితర రంగాలలో భారీ ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. దీంతో వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.
ఐటి సెక్టార్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున వత్తిళ్లకు లోనవుతున్నారు. దీంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా చితికి పోతున్నారు. తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. దీంతో సోషల్ , ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కు , సైకాలజీ లో అనుభవం కలిగిన వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అంతే కాకుండా సాఫ్ట్ స్కిల్స్, బిహేవిరియల్ , టెన్షన్ ఫ్రీగా ఉండేందుకు ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు, వివిధ సంస్థల్లో సలహాదారులుగా, పర్మినెంట్ గా పని చేస్తున్నారు. పలు వ్యక్తిగత సమస్యలతో సతమత మయ్యే వారికి స్వాంతన చేకూరుస్తున్నారు. దైనందిన జీవితంలో వత్తిళ్ల నుండి అధిగమించేందుకు ఆయా ప్రధాన హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా బాధితుల కోసం సెంటర్స్ ను నెలకొల్పారు.
హైదరాబాద్ లో చాలా మంది ట్రైనర్స్ వేలాది మందికి ట్రైనింగ్ ఇస్తూ రాణిస్తున్నారు. వారిలో జె.సి .కవిత తో పాటు సుమన్ సాయని , పట్టాభిరామ్ , తదితరులు పేరు పొందారు. ఆరోగ్య రంగంలో సాయని ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమె భర్త శ్రీనివాసన్ హైకోర్టు లో అడ్వొకేట్ గా పని చేస్తున్నారు. ప్రొఫెషనల్ గా రాణిస్తూ వేలాది మందికి స్వాంతన చేకూరుస్తున్నారు.
విద్యా పరంగా ఎంఏ సోషల్ వర్క్ , ఎమ్మెసి కౌన్సెలింగ్ సైకాలజీ , ఎంఏ ఎడ్యుకేషన్ , ఎంఏ హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్ , ఎంవిఓ – మేనేజ్మెంట్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్ , హెల్త్ సైకాలజీ లో పీహెచ్ డీ చేస్తున్నారు. స్నేహ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ గా , డెస్టినేషన్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సీఎండీ గా ఉన్నారు. సైబరాబాద్ విమెన్ ప్రొటెక్షన్ సెల్ లో ఫ్యామిలీ కౌన్సెలర్ గా సేవలు అందిస్తున్నారు. సైకో మాట్రిక్స్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ అండ్ చైల్డ్ గైడెన్స్ సెంటర్ లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు.
ఎలిబీ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ లో ఫుల్ టైం సైకాలజిస్ట్ గా సుమన్ సాయని పని చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుండి 200 స్వచ్ఛంద సంస్థలకు మేనేజ్ మెంట్ అండ్ డెవలప్ మెంట్ విభాగంలో కన్సల్టెంట్ గా ఉన్నారు. గ్రామీణ , ఆదివాసీ ప్రాంతాలలో 10 ఏళ్లుగా సేవలు అందజేస్తున్న కేర్ ఇంటర్నేషనల్ , అక్సో ఫామ్ సంస్థలకు సలహాదారుగా ఉన్నారు.
గత నాలుగేళ్లుగా ఆటిస్టిక్ బడులకు ప్రిన్సిపాల్ గా సేవలు అందించారు. మల్టీ నేషనల్ కంపెనీస్ తో పాటు ఐటి కంపెనీలకు వీపీ ఆపరేషన్స్ అంశంపై ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ రేడియో , వాయిస్ ఆఫ్ యూరోప్ ఎఫ్ ఎం స్టేషన్స్ లలో సుమన్ సాయని వాయిస్ ఆఫ్ బ్యూటిఫుల్ మైండ్స్ పేరుతో పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. అమెరికా అండ్ ఏసియా పేరొందిన టోరీ తెలుగు వన్ రేడియో లో జనాన్ని మోటివేట్ చేస్తున్నారు. విమెన్స్ ఎరా , గృహ శోభ మేగజైన్స్ లలో కాలమిస్ట్ గా ఉన్నారు.
పలు తెలుగు, ఇంగ్లిష్ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. మాటీవీ , ఈటివి -2 , టీవీ -5 డీడీ సప్తగిరి , టీవీ 7 న్యూస్ ఛానల్స్ లలో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు, కార్పొరేట్ కంపెనీలలో ప్యానెల్ సైకాలజిస్ట్ గా సేవలందిస్తున్నారు.హైద్రాబాద్ రోటరీ క్లబ్ , రైన్ బో కు ప్రెసిడెంట్ గా, విమెన్ ఇండియన్ అసోషియేషన్ కు కార్యదర్శిగా , చేయూత విమెన్ కౌన్సిల్ , ఏపీ స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ కి , ఎంజీవో ఫోరమ్ గ్రేటర్ హైదరాబాద్ కు కార్యనిర్వాహక సభ్యురాలిగా వున్నారు.
మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్ వర్క్ , ఫెడరేషన్ ఆఫ్ ఏపీ సీనియర్ సిటిజెన్ ఆర్గనైజేషన్ , హైద్రాబాద్ డైరెక్టర్ అండ్ సీయివో ఫోరమ్ లకు లైఫ్ మెంబర్ ఉన్నా ఉన్నారు సుమన్ సాయని. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా , డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ , సెంటర్ ఫర్ సోషల్ ఇనిషియేటివ్ అండ్ సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ , ఆంధ్రా యూనివర్సిటీ , అంబేద్కర్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ , కాకతీయ యూనివర్సిటీ , ఏపీ పోలీస్ అకాడెమీ లకు గెస్ట్ ఫ్యాకల్టీ గా ఉన్నారు.
సాయని హెల్త్ కేర్ కు ఫౌండర్ సీయీవోగా , తంబే హాస్పిటల్ లో సీఆరో గా ఇవాన్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ గా తదితర ఎన్నో కంపెనీలకు , సంస్థలకు సలహాదారుగా, ఫౌండర్ గా, సైకాలజిస్ట్ గా రాణిస్తున్నారు. వేలాది మందిలో స్ఫూర్తి నింపుతున్నారు. ప్రస్త్తుతం సుమన్ సాయని ఇంటికే వైద్యం కాన్సెప్ట్ తో వైద్య రంగంలో మార్పు తీసుకు వచ్చారు. డెస్టినేషన్ హెల్త్ కేర్ ద్వారా ఇంట్లోనే వైద్య సదుపాయం అందజేస్తున్నారు. వైద్యం కోసం వచ్చే పేదలకు భరోసా కల్పిస్తున్నారు.
వీరికి చేతనైనంత తక్కువ ఖర్చుతో ఆదుకుంటున్నారు. ఆరోగ్యం అత్యంత ఖరీదుగా మారడంతో హాస్పిటల్స్ కు వెళ్లాలంటే చాలా ఖర్చు తో పాటు ఇబ్బందులు .. దీనిని గుర్తించిన సుమన్ సాయని ..రోగుల ఇళ్ల వద్దకే డాక్టర్లు, కింది స్థాయి సిబ్బంది వెళతారు. అవసరమైన చికిత్స చేస్తారు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. డబ్బుల ఇబ్బంది తప్పుతుంది. ఇలాంటి ఐడియా రావడం ..దానిని ఆచరణలోకి తీసుకు రావడం గొప్పనైన విషయం. హెల్త్ కేర్ ఎట్ డోర్ స్టెప్స్ నినాదంతో ఆమె ముందుకు వెళుతున్నారు. రోగుల పాలిట దేవతగా మారారు.
No comment allowed please