#StartupClinics : మానసిక రోగులకు స్టార్టప్‌ల స్వాంతన
భారీగా పెరగనున్న మానిసక రోగుల సంఖ్య
Startup Clinics : ఇండియాలో రోజు రోజుకు జనాభా ఆక్టోపస్ లాగా పెరిగి పోతుంటే మరో వైపు మానసికంగా మరింత దిగజారుతూ ..ఆరోగ్య పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ .. వైద్యుల కోసం పరుగులు తీస్తున్నారు. మెంటల్ హెల్త్ విషయంలో తమ మీద తమకు పట్టు కోల్పోవడం జరుగుతోంది . ఈ విషయంలో ఎక్కువగా మహిళలు, యువతులు , బాలికలు , చిన్నారులు బాధితులుగా ఉంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచానా ప్రకారం ఇండియాలో రాబోయే 2030 లోపుకోటికి పైగా చేరుకుంటారని హెచ్చరించింది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా రోగుల కోసం మానసిక పరమైన స్వంత చేకూర్చే క్లినిక్ లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇప్పటికే మెంటల్ హెల్త్ పరంగా మెరుగైన చికిత్సను అందిస్తున్న వారిలో ఎందరో కృషి చేస్తున్నారు .
ఇంకొందరు బాధితులకు చికిత్స, సేవలు అందించేందు కోసం ఏకంగా స్టార్ట్ అప్ లు ఏర్పాటు చేసారు . ఇందు కోసం బ్రేకింగ్ సైలెన్స్ పేరుతో దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాయి అంకురాలు. ఇండియాలోని ప్రతి పది మందిలో ఒకరు లేదా ఇద్దరు మెంటల్ హెల్త్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
బాధితుల చికిత్స కోసం దాదాపు ట్రిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుందని అంచనా. శిప్రా దావర్, జో అగర్వాల్ , అనురీత్ , ఆరుషి సేథీ , రిచా సింగ్ లు కొత్తగా అంకురాలు ప్రారంభించారు. గూర్గావ్ కేంద్రంగా శిప్రా ఈసైక్లినిక్ పేరుతో స్టార్ట్ అప్ ను 2015 లో స్టార్ట్ చేసారు. ఆన్ లైన్ లో , ఆఫ్ లైన్ లో సేవలు అందిస్తోంది ఈ సంస్థ. ఇక్కడ మానసిక పరమైన సేవలు ఉచితంగా అందిస్తున్నారు .
దీంతో పాటు యాప్ కూడా తయారు చేసారు. ఈసీగా సేవలు పొందవచ్చు . థెరపిస్ట్ , యోగా , చికిత్స లతో జో అగర్వాల్ వైశా పేరుతో అంకురాన్ని స్టార్ట్ చేసారు .30 దేశాలలో 1 .2 మిలియన్స్ భాదితులు వీరి సేవలు పొందారు. ముంబై కేంద్రంగా అనురీత్ , అరుశ్రీ లు ట్రిజోగ్ పేరుతో 2014 లో ప్రారంభించారు.
పిల్లలు , పెద్దలు , యువతీ యువకులు , భాదితులకు ఇందులో చికిత్స అందిస్తున్నారు ఈ స్టార్ట్ అప్ లో. రిచా సింగ్ యువర్ దోస్త్ పేరుతో మరో క్లినిక్ స్టార్ట్ చేసారు. మెంటల్ హెల్త్ ఎక్స్ పర్ట్స్, కోచెస్ దేశంలోని 15 నగరాలలో సేవలు అందిస్తోంది. ఈ స్టార్ట్ అప్ లో సామ ఫనీంద్ర ఇందులో భారీగా పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద మెంటల్ హెల్త్ క్లినిక్ లు మరిన్ని రావాల్సిన వసరం ఉన్నది.
No comment allowed please