#IDFresh : పీసీ ముస్తఫా ఐడీ ఫ్రెష్ మార్కెట్ లో టాప్
కోట్లు కొల్లగొడుతున్నఐడి ఫ్రెష్
ID Fresh: ఇండియన్ ఫుడ్ మార్కెట్లో ఐడీ ఫ్రెష్ సంచలనాలు సృష్టిస్తూ ..గణనీయమైన ఆదాయాన్ని గడిస్తూ ..కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. పీసీ ముస్తఫా ఈ పేరు చెబితే చాలు హీ వాజ్ ఏ క్రియేటర్. రూరల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ యువకుడి మదిలో మెదిలిన ఐడియా ఇపుడు డాలర్లను కొల్లగొడుతోంది. అతడికి వచ్చిన ఒకే ఒక్క ఆలోచన..చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.
మనం రోజూ బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా తినే పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇడ్లి, దోశ, వడ, పరోటా ఐటమ్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు దుబాయి, అమెరికా, తదితర దేశాలకు విస్తరించింది ముస్తాఫా వ్యాపారం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని అతడిని చూస్తే తెలుస్తుంది.
పీసీ ముస్తాఫా ..బెంగళూరు కేంద్రంగా ఐడీ ఫ్రెష్(ID Fresh) స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. 16 వేల అవుట్ లెట్లను ఏర్పాటు చేశారు. ప్రతి చోటా ఐడీ ఫ్రెష్ ఉండేలా తీర్చిదిద్దారు. ఎవరైనా టిఫిన్లు వేడిగా అప్పటికప్పుడే తినాలని అనుకుంటారు. కస్టమర్ల అభిరుచులు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా ఐడీ ఫ్రెష్ ఆధ్వర్యంలో టిఫిన్లు తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. దీని బిజినెస్ ఏడాదికి 6 వేల కోట్లకు చేరుకుంది.
ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీలో ఇది అరుదైన రికార్డుగా నమోదైంది. ఇంజనీరింగ్ తో పాటు బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన ఈ యువకుడు ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వందలాది వాహనాలు ప్రతి రోజూ ఇడ్లి, దోశ ప్రాడక్ట్స్తో ప్రయాణం చేస్తున్నాయి.
ఐడీ ఫ్రెష్(ID Fresh) ఐటమ్స్‌కు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో తన వ్యాపారాన్ని ఆసియా ఖండంలోనే కాకుండా అమెరికా, తదితర దేశాలకు విస్తరించారు. ఇడ్లి, దోశ రుచికరంగా ఉండడం, వేడిగా, మరింత రుచికరంగా ఉండడంతో ..రెడీ టూ ఈట్ అనే పేరుతో తయారు చేసిన వీటిని జనం ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
దీంతో బెంగళూరు, చెన్నై , కోల్కత్తా, హైదరాబాద్, ముంబయి, న్యూఢిల్లీ , తదితర ప్రధాన నగారలకు విస్తరించింది. అవుట్ లెట్లతో పాటు ఐడీ ఫ్రెష్ ద్వారా తయారు చేసిన ప్రతి ప్రొడక్ట్ ను ఆయా ప్రధాన స్టోర్స్, మాల్స్, బిగ్ కిరాణాలలో లభిస్తున్నాయి. ఐడీ ఫ్రెష్ ఐటమ్స్‌కు డిమాండ్ ఉండడంతో వ్యాపారస్తులు ఈ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నారు.
బెంగళూరు నుంచి ప్రతి రోజు టన్నుల కొద్ది ఇడ్లి, దోశ, వడ, చపాతీ, తదితర ఐటమ్స్ కు సంబంధించినవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బెంగళూరులో ముస్తాఫా బిగ్గెస్ట్ ఐడీ ఫ్రెష్ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. దుబాయిలో కూడా టాప్ రేంజ్లో బిజినెస్ నడుస్తోంది. హౌ టు మేక్ ఇడ్లి అనే పేరుతో ఆయన పోటీలు కూడా పెడుతున్నారు.
ఫ్రెష్ ఐటమ్స్, ఫ్రెష్ టేస్ట్..రిచ్ సర్వీస్ ..ట్యాగ్ లైన్‌తో ఐడీ ఫ్రెష్ తన వాల్యూస్ మెయింటెనెన్స్ చేస్తూ బిజినెస్‌లో దూసుకెళుతోంది. మనీ ముఖ్యం కాదని..కష్టపడితే..డిఫరెంట్ గా ఆలోచిస్తే వాటంతట వస్తుందంటారు పీసీ ముస్తఫా. వీలైతే బెంగళూరులో ఉంటున్న ఈ యువకుడిని కలిసే ప్రయత్నం చేయండి.
No comment allowed please