#Innov8 : ఇన్నోవ్8 ను ఓయో టేకోవ‌ర్

దేశంలో ఎక్క‌డైనా అద్దెకు ఆఫీసులు

Innov8 : అంకురాల రంగంలో త‌న‌కంటూ ఓ స్టేట‌స్ సింబ‌ల్‌ను ఏర్పాటు చేసుకున్న ఇన్నోవ్8ను ప్ర‌పంచ హోట‌ల్ రంగంలో టాప్ రేంజ్‌లో ఉన్న ఓయో కంపెనీ ఏకంగా 30 మిలియ‌న్స్‌కు కొనుగోలు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ డిసిష‌న్‌తో స్టార్టప్స్ వేలో ఇదో మంచి శుభ ప‌రిణామం అంటూ మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. హాస్పిటాలిటీ రంగంలో ఓయో వినూత్న‌మైన పంథాను అనుస‌రిస్తూ ఇత‌ర హోట‌ల్స్ కు చుక్క‌లు చూపిస్తోంది. ఇపుడు దేశ వ్యాప్తంగా ఓయో నెట్‌వ‌ర్క్ విస్త‌రించింది.

ఎక్క‌డికి వెళ్లినా స‌రే ఓయో ద‌ర్శ‌నం ఇస్తోంది. ఇదంతా ఆ కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు రితీష్ అగ‌ర్వాల్‌కే క్రెడిట్ ద‌క్కుతుంది. ఇండియాతో పాటు ఓయో ప్రపంచంలోని 80 దేశాల‌కు విస్త‌రించింది. త‌న‌తో పాటు వ‌ర్కింగ్ పార్ట్‌న‌ర్‌గా ఉన్న ఇన్నోవ్8ను చేజిక్కించుకుంది. దీంతో దాని మార్కెట్ వాల్యూ భారీగా పెరిగింది. జ‌పాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ దీనికి వెన్ను ద‌న్నుగా నిలుస్తోంది.

ఇప్ప‌టి దాకా ఇంకా ఎంత స్థాయిలో ఈ స్టార్ట‌ప్‌ను టేకోవ‌ర్ చేశారో ఇంత దాకా ఓయో కంపెనీ యాజ‌మాన్యం ఇంకా వెల్ల‌డించ‌లేదు. గూర్గాన్ కేంద్రంగా ఈ సంస్థ విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. ప‌ని చేసే ప్ర‌దేశంలో మ‌రింత సంతోష‌క‌ర‌మైన వాతావార‌ణాన్ని ఓయో వ‌ర్క్ స్పేసెస్ ను ప్రారంభించింది. వుయ్ వ‌ర్క్ గా దీనికి నామ‌క‌ర‌ణం చేశారు.

దేశంలోని 10 ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ రెండు కంపెనీలు ఒక‌దానితో మ‌రొక‌టి అనుసంధానం అవుతాయి. దీని వ‌ల్ల స్పేస్‌తో పాటు రెంట్ క‌లిసొస్తుంది. అద‌నంగా మ‌రో 50 సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఓయో ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇంకో వైపు ఇండియా, చైనా, బ్రిట‌న్, దుబాయి, ఇండోనేషియా, మ‌లేషియా దేశాల‌లో సాఫ్ట్ బ్యాంకుతో క‌లిసి ఒక బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టింది ఓయో కంపెనీ.

ఓయో భారీ ఆదాయాన్ని మూట‌గ‌ట్టుకుంది. వ‌చ్చే ఐదేళ్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్స్ తో పోటీ ప‌డాల‌ని భావిస్తోంది. ఆ దిశ‌గా పావులు క‌దుపుతోంది ఓయో కంపెనీ. ఒక వైపు లోక‌ల్ మ‌రో వైపు ఇంట‌ర్నేష‌న‌ల్ రెండింటి మీద దృష్టి పెడుతోంది. ఇన్నోవ్8 న్యూఢిల్లీ కేంద్రంగా అంకుర సంస్థ‌గా ఏర్పాటైంది. వ‌ర్క్ స్పేసెస్‌ను క‌ల్పించ‌డ‌మే ఈ స్టార్ట‌ప్ ఉద్దేశం. దీని వ‌ల్ల టైంతో పాటు మ‌నీ కూడా మిగులుతుంది.

ప్ర‌తి నెలా ఎక్క‌డైనా ఆఫీస్ స్పేస్ కావాలాంటే దాదాపు ల‌క్ష‌ల్లో రెంట్ పే చేయాల్సి వ‌స్తుంది. కానీ ఇన్నోవ్ 8 తో టై అప్ అయితే చాలు..నెల‌కు 64 వేల 999 రూపాయ‌లు కాగా డెస్క్ , ఇత‌ర స‌దుపాయాల కోసం 9 వేల 999 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇన్నోవ్8 అంకుర సంస్థ చిర కాలంలోనే భారీ స్కోప్‌తో ముందుకెళుతోంది. త‌న వ్యాపారానికి తోడ్పాటుగా ఉంటుందనే ఉద్ధేశంతో ఇన్నోవ్‌8ను కొనుగోలు చేశాడు రితీష్ అగ‌ర్వాల్.

No comment allowed please