Dimuth Karunaratne : భారత జట్టుతో శ్రీలంక పోరాడేందుకు సిద్దమైంది. గతంలో అర్జున రణతుంగ, మహనామా, అరవింద డిజిల్వా, సంగక్కర, మార్వన్ ఆటపట్టు, ముత్తయ్య మురళీధరన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండే వారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు శ్రీలంక జట్టులో. అంతా జూనియర్లు, కొత్త ఆటగాళ్లతో నిండి పోయింది శ్రీలంక జట్టు. ఇక వరుస విజయాలతో దూసుకు పోతున్న టీమిండియాతో తలపడుతోంది.
ఇక లంక జట్టులో అంతా కొత్త వారే కావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. భారత జట్టుతో ఆడిన అనుభవం కూడా లేదు. సీనియర్ మాథ్యుస్ ఓపెనర్ గా రానున్నాడు.
ఇక కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(Dimuth Karunaratne ) పైనే శ్రీలంక జట్టు పూర్తిగా ఆధార పడి ఉంది. వీరిద్దరి మీదే ఆ జట్టు ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. టీ20 , వన్డే ఫార్మాట్ వేరు టెస్టు మ్యాచ్ ఫార్మాట్ వేరు.
ఈ ఆట ఆడాలంటే చాలా ఓపిక ఉండాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా శ్రీలంక జట్టులో స్కిప్పర్ గా ఉన్న కరుణ రత్నే అద్భుతమైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. నిలకడగా ఆడుతూ తన జట్టులో కీలకమైన వ్యక్తిగా మారాడు.
అతడు ఆడితే మిగతా ఆటగాళ్లు సహకరిస్తే కొంత మేరకు భారత్ కు పోటీ ఇవ్వ గలదు. లేక పోతే పూర్తిగా చేతులు ఎత్తేయాల్సిందే. ఇక మిడిల్ ఆర్డర్ లో ఆడే ధనంజయ డిసిల్వ కీలకం కానున్నాడు.
లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంబుల్ డెనియా పై గంపెడాశలు పెట్టుకుంది. మొత్తంగా శ్రీలంక ముగ్గురు పేసర్లతో రంగంలోకి దిగనుంది.
Also Read : ప్రపంచ కప్ తో రావాలి – కోహ్లీ