Ukraine Russia War : కాల్పుల క‌ల‌వ‌రింత క‌న్నీళ్ల ప‌ల‌వ‌రింత

ఆగ‌ని యుద్దం త‌ప్ప‌ని క‌ష్టం తీర‌ని విషాదం

Ukraine Russia War : యావ‌త్ ప్ర‌పంచం మొత్తుకుంటోంది యుద్దం ఆప‌మ‌ని. కానీ రాజ్యకాంక్ష న‌ర న‌రాన నెత్తికెక్కిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కు శాంతి కంటే విజ‌యం కావాలి.

త‌న‌ను ఎదిరించే వ్య‌క్తులు, శ‌క్తులు ఉండ‌కూడ‌ద‌ని అనుకుంటూ వ‌చ్చారు.

ఆ దిశ‌గా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేస్తున్న వారిపై తుపాకులు ఎక్కు పెట్టారు.

శ‌త్రు దుర్బేధ్యంగా ర‌ష్యాను మార్చేసిన ర‌ష్యా (Ukraine Russia War)ఇప్పుడు ఎవ‌రినీ ఖాత‌రు చేయ‌డం లేదు.

ఓ వైపు ఐక్య రాజ్య స‌మితి, యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు, బ్రిట‌న్, ఫ్రాన్స్, అమెరికా ను కూడా డోంట్ కేర్ అంటున్నారు.

చివ‌ర‌కు త‌న‌కు మిత్ర దేశంగా ఉంటూ వ‌చ్చిన భార‌త్ ను సైతం ప‌క్క‌న పెట్టింది. బాంబుల మోత మోగిస్తోంది.

ఎక్క‌డ చూసినా శ‌క‌లాలు క‌నిపిస్తున్నాయి. కానీ క‌నిక‌రించ‌డం లేదు. ఇప్ప‌ట్లో యుద్దం ఆగుతుందున్న న‌మ్మ‌కం లేదు. ఆశ అంత‌క‌న్నా లేదు.

మ‌రో వైపు అణుబాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు. కానీ ఉక్రెయిన్ పై ఏక‌ప‌క్ష దాడులకు ర‌ష్యా దిగినా ఎక్క‌డా త‌ల వంచ లేదు. యుద్దానికి సిద్ద‌మంటూ స్ప‌ష్టం చేసింది.

ఇందుకు ప్ర‌త్యేకంగా ఒప్పు కోవాల్సింది . ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు గెలెన్స్కీ. తానే ఆయుధ‌మై ముందు నిలిచాడు.

ఆ దేశ సైన్యానికి రోల్ మోడ‌ల్ గా నిలిచాడు.

జీవితం అంటే ఓడి పోవ‌డం కాద‌ని, ఆత్మ గౌర‌వాన్ని చంపు కోవ‌డం త‌న‌కు ఇష్టం లేదంటూ ప్ర‌క‌టించాడు.

తాను ఆశించిన యూరోపియ‌న్ దేశాలే కాదు అమెరికా కూడా చేతులెత్తేసినా తాను మాత్రం ముందుకే క‌దిలాడు.

ఈ క్ర‌మంలో ర‌ష్యాకు ఒక ర‌కంగా కోలుకోలేని షాక్ ఇచ్చాడ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

అందుకే ఉక్రెయిన్ చీఫ్ ను మ‌ట్టు బెట్ట‌డ‌మే త‌న‌కు కావాల్సింద‌ని భీష్మించుకు కూర్చున్నాడు పుతిన్.

ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతోంద‌నే దానిపై ఎవ‌రికీ క్లారిటీ లేకుండా పోయింది.

ఈ లోకానికి , స‌మ‌స్త మాన‌వాళికి కావాల్సింది యుద్దం కాదు..శాంతి కావాలి. యుద్దం పేరుతో మ‌నుషుల్ని చంపే అధికారం, హ‌క్కు ఎవ‌రిచ్చారు వీళ్ల‌కి.

ఇది పూర్తిగా నేరంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. ప్ర‌పంచం ముందు అస‌లైన దోషులు ఎవ‌రంటే ర‌ష్యా చీఫ్ పుతిన్, అమెరికా అధ్య‌క్షుడు బైడ‌న్ .

ఒక‌రిపై మ‌రొక‌రికి ఆధిప‌త్యం ఉండాల‌న్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కుట్ర‌ల్లో భాగ‌మే ఉక్రెయిన్ పై యుద్దం.

చ‌నిపోయిన వారి కుటుంబాలకు ఎవ‌రు భ‌రోసా క‌ల్పిస్తారో కూడా చెప్పాల్సి ఉంటుంది.

వీరిద్ద‌రినీ యుద్ద నేర‌స్తులుగా ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికైనా పుతిన్ మారాలి. లేక పోతే చ‌రిత్ర‌లో చీక‌టి పేజీ అత‌డిపై నిలిచే ఉంటుంది.

మొత్తంగా ఈ దారుణ మార‌ణ హోమంకు సాక్ష్యంగా ప్ర‌పంచం జ‌వాబుదారీగా ఉండాల్సిందే.

ఇవాళ ఉక్రెయిన్ వంతు రేపు తైవాన్ వంతు రాద‌న్న న‌మ్మ‌కం లేదు. చైనా ఉవ్విళ్లూరుతోంది త‌న‌ను నిల‌దీస్తున్న తైవాన్ పై దాడి చేసేందుకు.

ర‌ష్యా చేసిన ఈ దాడి బ‌ల‌మైన దేశాల‌కు ఒక అవ‌కాశంగా మ‌రో మార్గంగా దోహ‌ద ప‌డుతుంద‌ని సందేహం లేదు.

ఈ ప్ర‌పంచానికి కావాల్సింది బాంబులు, మిస్సైళ్లు..యుద్ద విమానాలు కాదు కాసింత శాంతి కావాలి. గుప్పెడు ప్రేమ కావాలి.

Also Read : మామూలోడు కాదు పుతిన్ పులి లాంటోడు

Leave A Reply

Your Email Id will not be published!