Sunil Gavaskar – Joe Root : జో రూట్ పై స‌న్నీ షాకింగ్ కామెంట్స్

ఆట‌లో ఏదైనా సాధ్య‌మేన‌న్న కామెంటేట‌ర్

Sunil Gavaskar – Joe Root : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌స్తుత వ్యాఖ్యాత సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. క్రికెట్ లో 10,000 ప‌రుగులు చేసిన మొద‌టి క్రికెట‌ర్.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత దూరంలో ఉన్నాడు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్. అయితే 31 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అత్య‌ద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్నాడు.

లార్డ్స్ వేదిక‌గా న్యూజిలాండ్ తో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచ్ లో 10,000 ప‌రుగుల మైలు రాయి దాటాడు. అజేయ శ‌త‌కంతో త‌న జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు.

ప్ర‌స్తుతం స‌చిన్ రికార్డును చేరుకోవ‌డమో లేదా బ‌ద్ద‌లు కొట్టాలంటే ఒకే ఒక్క క్రికెట‌ర్ కు ఛాన్స్ ఉంది. అదెవ‌రో కాదు జో రూట్. అంటే ఇంకా టెస్టు క్రికెట్ లో 8 ఏళ్ల పాటు ఆడాల్సి ఉంటుంద‌న్నాడు సునీల్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar – Joe Root) .

ప్ర‌తి సీజ‌న్ లో క‌నీసం 800 నుంచి 1000 ప‌రుగులు చేస్తేనే స‌చిన్ రికార్డుకు చేరువ‌య్యే ఛాన్స్ ఉంద‌న్నాడు. ఇప్ప‌టి దాకా చూస్తే చాలా క‌ష్ట‌మైన ప‌ని గా అభివ‌ర్ణించాడు. అదే స‌మ‌యంలో క్రికెట్ ఆట‌లో ఏదైనా జరిగేందుకు ఆస్కారం ఉంద‌న్నాడు.

తాము ఆడుతున్న స‌మ‌యంలో రిచ‌ర్డ్ హాడ్లీ రికార్డు ను ఎవ‌రు ఛేజ్ చేస్తార‌ని అనుకున్నాం. కానీ ఆ రికార్డు కూడా బ‌ద్ద‌లైంది. మ‌రికొన్ని కొత్త రికార్డులు వ‌చ్చి చేరాయ‌న్నాడు.

మొత్తంగా చూస్తే జో రూట్ స‌చిన్ నెల‌కొల్పిన రికార్డును ఛేజ్ చేయాలంటే చాలా ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంద‌ని మాత్రం స్ప‌ష్టం చేశాడ స‌న్నీ.

Also Read : ఐపీఎల్ డిజిట‌ల్ రైట్స్ అంబానీ చేతికి

Leave A Reply

Your Email Id will not be published!