Pawan Kalyan : సమస్యలపై యుద్దం సర్కార్ పై పోరాటం
ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్
Pawan Kalyan : నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. ప్రజల కోసం పాలిటిక్స్ లోకి వచ్చా. నాకు ప్రజలే దేవుళ్లు. వాళ్ల సమస్యలను ప్రస్తావిస్తూనే ఉంటా. వారికి ఇబ్బంది తొలగి పోయేంత వరకు నా వంతుగా పోరాటం చేస్తూనే ఉంటా. ఎన్ని అవాంంతరాలు వచ్చినా లేదా ఎన్ని అడ్డంకులు కల్పించినా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆగడని గుర్తు పెట్టు కోవాలని హెచ్చరించారు.
ఓట్లు, సీట్లు తమకు ముఖ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు. తాను గనుక రాజకీయాలు చేస్తే ఏ ఒక్కరు మిగలరన్నారు పవన్ కళ్యాణ్. ప్రజల కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు రాక పోయినా నామినేషన్లు వేస్తామని అన్నారు. యువత చెడిపోకుండా ఉండేందుకు తాను ప్రకటనలు చేయలేదని చెప్పారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) .
ఎవరో ఏదో అంటారని తాను పట్టించుకోనని కుండ బద్దలు కొట్టారు. వాళ్ల అజ్ఞానం ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. జగనన్న ఇళ్లు పేదలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పేదలకు ఇళ్లు నిర్మించి ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. నాపై ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మోదీకి, అమిత్ షాకు చాడీలు చెబుతూ వస్తున్నాడంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలకు ఎవరు కావాలో తెలుసని అన్నారు.
నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇక పని చేయని నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
Also Read : సరిహద్దు ఉద్రిక్తం ఆర్మీ చీఫ్ ఆగ్రహం