Al Zawahiri Bin Laden : ఆ ఇద్ద‌రు అమెరికాను వ‌ణికించారు

భ‌యం అంటే ఎలా ఉంటుందో చూపించారు

Al Zawahiri Bin Laden : అమెరికా అంటేనే డాల‌ర్లు గుర్తుకు వ‌స్తాయి. కానీ అంత‌కంటే దాని కుటిల రాజ‌నీతి మాత్రం కొంద‌రికి మాత్ర‌మే అర్థం అవుతుంది. ప్ర‌పంచ మార్కెట్ ను డాల‌ర్ శాసిస్తోంది.

ఎప్పుడైతే అది ఆధిప‌త్యం వ‌హిస్తూ వ‌స్తోంది ఆనాటి నుంచి అమెరికా ప్ర‌పంచంపై పెద్దన్న పాత్ర వ‌హించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అమెరికాను ఢీకొట్టే వారంటే దానికి గిట్ట‌దు. ఎవ‌రు దానిని వ్య‌తిరేకించినా లేదా దానితో యుద్దం ప్ర‌క‌టించినా చూస్తూ ఊరుకోదు. ఆ దేశంలోని

ప్ర‌జ‌ల కంటే అక్క‌డ ఆయుధాలే ఎక్కువ‌గా ఉన్నాయంటే అర్థం చేసుకోవ‌చ్చు.

అది ఎంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన దేశ‌మో. ఆర్థికంగానే కాదు ఆయుధాల ప‌రంగా కూడా ప‌వ‌ర్ ఫుల్ పొజిష‌న్ లో ఉంది యుఎస్. అంత‌టి అమెరికా ఆధిప‌త్యానికి చెక్ పెట్టే ప‌ని చేశారు ఆ ఇద్ద‌రు.

వారెవ‌రో కాదు ఉగ్ర‌వాదమే ఊపిరిగా చేసుకుని తుపాకుల‌తో రాజ్యాల‌ను కూల్చ‌డం లేదా స్వాధీనం చేసుకోవాల‌న్న దుర్మార్గ‌మైన ఆలోచ‌న‌తో

ఏర్పాటు చేసిందే అల్ ఖైదా.

ఇది మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ గ్రూప్ గా అమెరికానే ప్ర‌క‌టించింది. ఈ పేరు చెబితే అమెరికా వెన్నులో వ‌ణుకు పుడుతుంది. తానే ఉగ్ర‌వాదుల‌కు

ఊతం ఇచ్చి తానే ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసి తానే హ‌త మార్చే సంస్కృతి అగ్ర‌రాజ్యానిది.

అల్ ఖైదాను ఏర్పాటు చేసింది బిన్ లాడెన్ అయితే కీల‌క పాత్ర‌ధారి అల్ జ‌వ‌హ‌రి. ఈ ఇద్ద‌రు ప్లాన్ చేయ‌డం ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌డంలో దిట్ట‌. ఏకంగా ఇద్ద‌రూ క‌లిసి రాకెట్ తో అమెరికా ట‌వ‌ర్ పై దాడి చేశారు.

దీంతో ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గురైంది అమెరికా. ఆ త‌ర్వాత తేరుకుంది. ఎవ‌రు చేశార‌నే దానిపై గుర్తించింది. ఈ దారుణ‌మైన ఘ‌ట‌నలో

ఎంద‌రో ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘ‌ట‌న 2001లో చోటు చేసుకుంది. ఆనాటి నుంచి అమెరికా ఆ ఇద్ద‌రిని మ‌ట్టు బెట్టేందుకు సెర్చింగ్ చేస్తూనే వ‌చ్చింది. చివ‌ర‌కు బిన్

లాడెన్ ను పాకిస్తాన్ లో 2011లో హ‌త‌మార్చింది.

ఇందుకు దానికి ప‌దేళ్లు ప‌ట్టంది. ఆ త‌ర్వాత 21 ఏళ్ల అనంత‌రం ఆఫ్గ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్ లో త‌ల‌దాచుకున్న అల్ జ‌వ‌హ‌రిని(Al Zawahiri Bin Laden) ఖ‌తం చేసింది. సో ఏది ఏమైనా ఆ ఇద్ద‌రు ఇవాళ లేక పోయినా ఒక‌టి మాత్రం నిజం అమెరికాను వ‌ణికించారు.

Also Read : అత‌డిని మ‌ట్టుబెట్టేందుకు 21 ఏళ్లు

Leave A Reply

Your Email Id will not be published!