#AlooParatha : నోరూరించే ఆలూ పరోటా..

ఆలూ పరోటా చాలా మందికి ఇష్టమైన వంటకం.

Aloo Paratha : ఆలూ పరోటా చాలా మందికి ఇష్టమైన వంటకం. ఇది నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువగా తయారు చేసుకునవారు. కానీ ఇప్పుడు ఇండియా మొత్తం ఫేమస్ అయ్యింది. ప్రతీ ఒక్కరికి ఫేవరేట్ డిష్ అయిపోయింది. అందుకే ఈ రోజు మనం ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ముందుగా దీనికి కావలసిన పదార్ధాలు, తయారుచేయు విధానం ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు :

గోధుమ పిండి – 1/2 కేజీ
మైదా పిండి – 1/2 కేజీ
బంగాళదుంపలు – 1/2 కేజీ
ఉల్లిపాయలు – 2
పచ్చిమిరపకాయలు – 4
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్స్
పుదీనా, కొత్తిమీర – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడ
పసుపు – చిటికెడు

తయారీ విధానం :

ముందుగా ఒక పాత్రలో గోధుమపిండి, మైదాపిండిలను చపాతీ పిండిలా కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బంగాళదుంపలను ఉడికించుకుని పొట్టుతీసి, మెదిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి కాగిన తరువాత పోపు వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఈ ముక్కలు వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి ముద్ద , పుదీనా, కొత్తిమీర వేసి అందులో బంగాళదుంప ముద్దవేసి బాగా కలిపి దించేయాలి.

ఈ ముద్ద చల్లారిన తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిలా కలిపి పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా వత్తుకోవాలి. అలా వత్తుకున్న పూరీల మధ్యలో ఆలూ ముద్దను ఉంచి కూర బయటకు రాకుండా మడిచి చుట్టూ వత్తుకోవాలి. తరువాత వీటిని పెనంపై బటర్ తో కాల్చుకుంటే ఆలూ పరోటా రెడీ అయినట్లే.

No comment allowed please