Ameer Sultan Rajinikanth : తలైవాకు అవార్డుపై సోహైల్ ఫైర్
ఆ అవార్డు తీసుకునే అర్హత లేదు
Ameer Sultan Rajinikanth : ప్రముఖ నటుడు రజనీకాంత్(Rajinikanth) పై సంచలన కామెంట్స్ చేశారు ప్రముఖ దర్శకుడు అమీర్ సుల్తాన్. కోట్లాది మంది అభిమానులు తలైవాకు ఉన్నారు. దేశ వ్యాప్తంగా పేరొందిన అగ్ర నటుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. 2007లో వచ్చిన శివాజీ సెన్సేషన్ గా నిలిచింది.
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దీనిని తీశారు. ఆ ఏడాది తమిళనాడులోనే కాదు దేశ వ్యాప్తంగా..వరల్డ్ వైడ్ గా బిగ్ కలెక్షన్లు సాధించాయి. అయితే ఈ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించింది. దీనిపై దర్శకుడు అమీర్ సుల్తాన్ స్పందించారు. తీవ్ర విమర్శలు చేశాడు.
పరుత్తి వీరన్ , ఆది భగవాన్ వంటి చిత్రాల దర్శకుడిగా పేరు పొందారు. మీ మనస్సాక్షిని అడగండి ..ఆ అవార్డుకు రజనీకాంత్ అర్హుడేనా అని ప్రశ్నించారు. ఆ ఏడాది పురస్కారం ఆనాడు ఇవ్వడం కరెక్టేనా అని నిలదీశారు. 2007లోనే ఏడాది అమీర్ దర్శకత్వం వహించిన పరుత్తివీరన్ విడుదలైంది. కానీ ఆనాడు రజనీకాంత్ శివాజీకి(Ameer Sultan Rajinikanth) అవార్డు ఇవ్వడాన్ని తప్పుపట్టారు.
అమీర్ ఉత్తమ దర్శకుడిగా తమిళ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రజనీకాంత్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ చిత్రం చేశాడు. తన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న లాల్ సలాం చిత్రంలో అతిథిగా నటిస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు అమీర్ సుల్తాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆనాటి అవార్డుపై ఇప్పుడు ప్రస్తావించడాన్ని తప్పు పడుతున్నారు.
Also Read : నేను ఇంకా చని పోలేదు – కోట