Amrit Pal Singh : లొంగి పోయాడా అరెస్ట్ అయ్యాడా
ఎవరీ అమృత పాల్ సింగ్
Amrit Pal Singh : దేశ వ్యాప్తంగా కలకలం రేపిన వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత పాల్ సింగ్(Amrit Pal Singh) ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు 37 రోజుల తర్వాత లొంగి పోయాడు. భింద్రన్ వాలే 2 గా పేరు పొందాడు. గత మార్చి 18న తప్పించుకుని పారి పోయాడు. అతడిని వేటాడేందుకు పంజాబ్ , ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. స్టైల్ నుండి మ్యానరిజమ్ దాకా అమృత పాల్ సింగ్ తనను తాను జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే అనుచరుడి నంటూ ప్రకటించుకున్నాడు. సింగ్ లక్ష్యం ఒక్కటే ఖలిస్తాన్ దేశం కావాలని. ఆ ఉద్యమానికి ఊపిరి పోసే పనిలో ఉన్నాడు.
సిక్కులంతా ప్రత్యేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చాడు. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల మేరకు అమృత పాల్ సింగ్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. దీంతో ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యింది. అమృత పాల్ సింగ్ కు మెంటర్ గా ఉన్న స్వర్ణ జిత్ సింగ్ తో పాటు ఇటీవల లండన్ వెళ్లేందుకు పారి పోతుండగా అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు.
అమృత పాల్ సింగ్ స్వస్థలం పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లా జల్లుపూర్ ఖేరా. అతడి కుటుంబం దుబాయ్ లో రవాణా వ్యాపారం నిర్వహిస్తోంది. 2012 నుండి అక్కడే ఉంటున్నాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు అమృత పాల్ సింగ్(Amrit Pal Singh).
దీప్ సిద్దూ స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థకు చీఫ్ గా ఉన్నాడు. దీప్ సిద్దూ రోడ్ ప్రమాదంలో మరణించాడు. అయితే సిద్దూ సోదరుడు మన్ దీప్ మాత్రం తన సోదరుడి పేరును దుర్వినియోగం చేస్తున్నాడంటూ అమృత్ పాల్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశాడు.
అమృత పాల్ సింగ్ కు మరో పేరు కూడా ఉంది. అదేమిటంటే భింద్రన్ వాలే 2.0. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమృత సర్ శివార్ల లోని పోలీస్ స్టేషన్ పై అమృత పాల్ సింగ్ మద్దతుదారులు దాడి చేశారు. దీంతో అతడి పేరు వార్తల్లోకి వచ్చింది.
ఆ తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో తప్పించుకున్నాడు సింగ్. అతడి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధల అక్రమంగా కలిగి ఉన్నందుకు కేసు నమోదు చేశారు. మొత్తంగా సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పేరు పొందిన అమృత పాల్ సింగ్ లొంగి పోవడం విస్తు పోయేలా చేసింది.
Also Read : అమృత పాల్ సింగ్ అరెస్ట్