Animal Trailer : వంగా యానిమ‌ల్ వారెవ్వా

మూవీ ట్రైల‌ర్ సెన్సేష‌న్

Animal : మోస్ట్ టాలెంటెడ్ , డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ర‌ణబీర్ క‌పూర్ , ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన యానిమ‌ల్ మూవీ ట్రైల‌ర్ దుమ్ము రేపుతోంది. సినిమాకు సంబంధించి ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు . ఇప్ప‌టికే అంచ‌నాల‌ను దాటుకునేలా ఉంది ట్రైల‌ర్.

Animal Trailer Viral

ర‌ణ బీర్ క‌పూర్ త‌న‌లోని న‌ట‌న సామ‌ర్థ్యాన్ని తెర‌పై చూపించాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే వంగా సందీప్ రెడ్డి ప్ర‌తి ఫ్రేమ్ లో క‌నిపించేలా చేశాడు. తండ్రి పాత్ర‌లో అనిల్ క‌పూర్ లీన‌మై పోయాడు. కొడుకు పాత్ర‌లో ర‌ణ బీర్ క‌పూర్ జీవించాడు.

ఇక నేష‌న‌ల్ క్ర‌ష్ గా పేరు పొందిన ర‌ష్మిక మంద‌న్నా మ‌రోసారి త‌నేమిటో చూపించింది యానిమ‌ల్ లో. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్స్ , ట్రైల‌ర్ , సాంగ్స్ దుమ్ము రేపాయి. మొత్తంగా సోష‌ల్ మీడియాలో డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి సెన్సేష‌న్ క్రియేట్ గా మారాడు. ప్ర‌స్తుతం యానిమ‌ల్(Animal) ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

ఇప్ప‌టికే అర్జున్ రెడ్డితో త‌న‌కంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న వంగా మ‌రోసారి రికార్డ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. డిసెంబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయ్యేందుకు సిద్దంగా ఉంది.

Also Read : Barrelakka Campaign : దడ పుట్టిస్తున్న బ‌ర్రెల‌క్క

Leave A Reply

Your Email Id will not be published!