Barrelakka Campaign : దడ పుట్టిస్తున్న బ‌ర్రెల‌క్క

దాడి చేసినా దూసుకు పోతోంది

Barrelakka Campaign : కొల్లాపూర్ – యావ‌త్ తెలంగాణ‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇండిపెండెంట్ గా బ‌రిలోకి నిలిచిన బ‌ర్రెల‌క్క‌. త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతూ ఊరూరా ప్ర‌చారం చేస్తున్నారు. ఆమె వెనుక నిరుద్యోగులు, గాయ‌నీ గాయ‌కులు, ప్రజా సంఘాలు, న్యాయ‌వాదులు, ప్ర‌జాస్వామిక వాదులు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

Barrelakka Campaign

ఇవాళ రాష్ట్రంలో 40 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న నిరుద్యోగులంతా బ‌ర్రెల‌క్క గెల‌వాల‌ని కోరుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతున్నారు బ‌ర్రెల‌క్క‌. ఇక్కడ ప్ర‌ధాన పార్టీల త‌ర‌పున హేమాహేమీలు బ‌రిలో ఉన్నారు. గ‌తంలో మంత్రిగా ప‌ని చేసిన జూప‌ల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ(Congress) త‌ర‌పున పోటీ చేస్తుండ‌గా వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన బీజేపీ అభ్య‌ర్థిగా సుధాక‌ర్ రావు, బీఆర్ఎస్ త‌ర‌పున బీరం హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి పోటీలో ఉన్న‌ప్ప‌టికీ బ‌ర్రెల‌క్క ఇప్పుడు ప్ర‌చార ప‌రంగా నెంబ‌ర్ వ‌న్ లో నిలుస్తున్నారు.

హైకోర్టుకు చెందిన లాయ‌ర్లతో పాటు ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్టులో న్యాయ‌వాదిగా ఉన్న వారు కూడా ఇవాళ బ‌ర్రెల‌క్క‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. మ‌రో వైపు మాజీ సీబీఐ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీ నారాయ‌ణ సైతం బేష‌ర‌తు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో బ‌ర్రెల‌క్క ఏం చేయ‌బోతోంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : Election Commission Issues : రాహుల్ గాంధీకి ఈసీ షాక్

Leave A Reply

Your Email Id will not be published!