Ants in Mortuary: మృతదేహానికి చీమలు ! ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ?

మృతదేహానికి చీమలు ! ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ?

Ants in Mortuary: వైఎస్ఆర్ కడప జిల్లా(Kadapa) జమ్మలమడుగులో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం గదిలో ఫ్రీజర్ బాక్స్ లో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫ్రీజర్ బాక్సులో ఉన్న మృతదేహానికి చీమలు పట్టడంతో… మృతురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అయితే ఆసుపత్రి సిబ్బంది చీమలు మందు కొనుక్కొని తెచ్చుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీనికి కాసేపు ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Ants in Mortuary Viral

ఈ నెల 29న జమ్మలమడుగులోని బీసీ కాలనీకు చెందిన 16 ఏళ్ళ బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనితో కేసు నమోదు చేసిన జమ్మలమడుగు పోలీసులు… పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అనివార్య కారణాల వలన ఆమెకు అదే రోజు పోస్ట్ మార్టం నిర్వహించడం కుదరకపోవడంతో… మృతదేహాన్ని పోస్ట్ మార్టం గదిలోని ఫ్రీజర్ బాక్సులో ఉంచారు. అయితే మరుసటి రోజు వచ్చి చూసేసరికి మృతదేహం నిండా చీమలు కనిపించడంతో… అవాక్కైన మృతురాలి బంధువులు… ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. అయితే చీమల మందు కొనుక్కొని తెచ్చుకొని శుభ్రం చేసుకోమాని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వారు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించడంతో… పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఫీక్‌పాషా మాట్లాడుతూ మృతదేహాన్ని ఉంచే సమయంలో ఫ్రీజర్‌ బాగానే ఉందన్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Also Read : N Chandrababu Naidu: ఏపీ డీజీపీ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!