AP BJP : ఏపీ బీజేపీ నుంచి అసెంబ్లీ అభ్యర్థులు వీరే

తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని గతంలోనే అధికారికంగా ప్రకటించారు

AP BJP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 24 మంది పార్లమెంట్ అభ్యర్థులతో జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ముఖ్యంగా నిన్నమొన్నటి వరకు లోక్‌సభలో 11 సీట్లను క్లెయిమ్ చేసిన భారతీయ జనతా పార్టీ.. చివరకు కేటాయించిన ప్రకారం 10 సీట్లను మాత్రమే ప్రకటించింది. అయితే మరికొద్ది రోజుల్లో 11వ స్థానం ప్రకటిస్తారా లేక 10వ స్థానం కన్ఫర్మ్ అవుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని గతంలోనే అధికారికంగా ప్రకటించారు. జనసేన తన 21 అసెంబ్లీ స్థానాలను, 2 లోక్‌సభ స్థానాలను తీసుకుంది. బీజేపీకి(AP BJP) అసెంబ్లీలో 10, లోక్‌సభలో 6 సీట్లు వచ్చాయి. ఇందులో భాగంగా 144 స్థానాలకు గానూ 139 స్థానాలను కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం ఇప్పటికే సిద్ధమైంది. 21 స్థానాలకు గానూ జనసేన 18 పేర్లను ఖరారు చేసింది. రెండు పార్టీల నేతలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా 10 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది.

AP BJP MLA Candidates

  1. అదోని – పీవీ పార్థ సారధి
  2. ధర్మవరం – సత్యకుమార్
  3. ఎచ్చెర్ల – ఎన్. ఈశ్వర్ రావు
  4. విశాఖ నార్త్ – విష్ణు కుమార్ రాజు
  5. అరకు – పంగి రాజారావు
  6. విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
  7. కైకలూరు – కామినేని శ్రీనివాస్ రావు
  8. అనపర్తి – శివ కృష్ణం రాజు
  9. బద్వేల్ – బొజ్జా రోషన్న
  10. జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి

Also Read : Kerala CM Daughter : కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు

Leave A Reply

Your Email Id will not be published!