AP CM YS Jagan I-PAC : ఐ ప్యాక్ టీమ్ తో జగన్ ముచ్చట
ముందస్తు ఎన్నికలపై చర్చ
AP CM YS Jagan I-PAC : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా. అవుననే సంకేతాలు సీఎం ఇస్తున్నారు. ఇప్పటికే ఏపీలో రావాలి జగన్ కావాలి జగన్ అంటూ సుదీర్ఘ పాదయాత్రతో చరిత్ర సృష్టించారు జగన్ రెడ్డి. ఆయనను అధికారంలోకి తీసుకు వచ్చేలా చేయడంలో, ప్రజల్లోకి దగ్గరయ్యేలా చేయడంలో, ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని దించడంలో కీలక పాత్ర పోషించారు భారతీయ ఎన్నికల వ్యూహకర్త , ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్.
ఇదే సమయంలో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ రంగంలోకి దూకాయి. ఈసారి ఎన్నికల్లో స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ చీఫ్ , ఏపీ సీఎం జగన్ రెడ్డి. ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రచారం జరిగింది. దీనిపై ఒకవేళ వెళితే ఎలా ఉంటుందనే దానిపై సీఎం ఐప్యాక్ టీమ్(I-PAC Team) తో విస్తృతంగా చర్చించారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టామని తమకు ఢోకా లేదంటూ ప్రకటించారు వైసీపీ ప్రభుత్వ సలహాదారు, పార్టీ అగ్ర నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. కానీ జగన్ ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చిన వెంటనే ఐ ప్యాక్ టీమ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ సర్కార్ పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా ఐ ప్యాక్ చెప్పినట్లు సమాచారం.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
