Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీివారిని దర్శించుకున్న 69,483 మంది భక్తులు
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. వేసవి సెలవులు ముగిసినా ఇంకా భక్తుల తాకిడి తగ్గక పోవడం విశేషం. రోజు రోజుకు భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలు హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి , అలివేలు మంగమ్మలను 69 వేల 483 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి కరుణకు పాత్రులయ్యారు. ఇక శ్రీవారికి సంబంధించిన కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం ర. 3.58 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
మొన్నటి కంటే నిన్న స్వామి వారికి నిత్యం సమర్పించే తలనీలాలకు సంబంధించి చూస్తే పెరిగారు. కాగా 32 వేల 459 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించుకున్నారు. మరో వైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి భక్తులు తిరుమలకు విచ్చేశారు.
తిరుమలలోని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హస్ వద్ద నిలిచి ఉన్నారు. కాగా టోకేన్లు లేకుండా ఉన్న భక్తులు సర్వ దర్శనం కోసం బారులు తీరారు. వీరికి దర్శన సమయం కనీసం 24 గంటలకు పైగా పట్టనుందని టీటీడీ వెల్లడించింది.
Also Read : Rahul Gandhi Case Comment : రాహుల్ కేసేంటి దాని కథేంటి
