మాస్కో: రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, డౌన్ స్ట్రీమ్ మిథనాల్ కెమికల్ ఇన్ ఫ్రా ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ప్రముఖ కన్సార్షియమ్ రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ , ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ దర్యా అషానియా లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భారత్ దిగుమతి చేసుకునే పెట్రో కెమికల్, స్పెషాలిటీ కెమికల్స్ ఫీడ్ స్టాక్ లను అత్యాధునిక సాంకేతిక పరిజ్జానంతో ప్రాసెస్ చేసేందుకు వీలుగా భారత తూర్పు తీరంలోని విశాఖ-కాకినాడ పిసిపిఐఆర్ (పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్టిమెంట్ రీజియన్ – PCPIR) పరిధిలో రస్ కెమ్ ఆధ్వర్యాన ఒక అధునాతన ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. భారత పోర్టుల్లో బల్క్ కెమికల్ స్టోరేజి, పంపిణీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి, ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్త్ ల నిర్మాణం, పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించాలని సూచించారు. రెడీ టు యూజ్ ప్లగ్ అండ్ ప్లే స్పేస్ లు, సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుంటూ భారత్ లో ఒక ప్రధాన కొలాబరేటివ్ పాలిమర్ అప్లికేషన్ , మెటీరియల్ సైన్స్ పరిశోధనా కేంద్రం (ఆర్ , డి సెంటర్) ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు నారా లోకేష్. రస్ కెమ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఉపయోగించి…భారత్ లోని రెన్యువబుల్ ఎనర్జీ కారిడార్లను అనుసంధానిస్తూ… లో-కార్బన్ రసాయనాల మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ స్పందిస్తూ… రస్ కెమ్ కార్పొరేట్ ఫ్రేమ్ వర్క్ ద్వారా భారత్ లో ప్రత్యేకమైన ఎస్ పివిలు, హోల్ సేల్ కెమికల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రియల్ పోర్టు ఫోలియో, మౌలిక సదుపాయాల కోసం ప్రీమియం రా మెటీరియల్స్, సాల్వెంట్స్, అడ్వాన్స్ డ్ పాలిమర్ మాడిఫైర్లను అందిస్తుందని తెలిపారు. లోకలైజ్డ్ ట్రేడ్ స్ట్రాటజీలో భాగంగా హై వ్యాల్యూ కెమికల్ సప్లయ్ పెంచడానికి రస్ కెమ్ నియంత్రణలో పని చేయడానికి ఆసక్తి చూపే సంస్థలతో కలసి పనిచేస్తుందని అన్నారు. ముంబై, కాన్పూరులోని కీలక పంపిణీ కేంద్రాలు అత్యధిక స్వచ్చత కలిగిన హెక్సామైన్, టైటానియం డయాక్సైడ్ ను కర్మాగారాలకు చేరవేస్తాయని చెప్పారు. గ్లోబల్ ఎకోసిస్టమ్, ఖాతాదారులకు స్థిరమైన లార్జ్ స్కేల్ సప్లయ్ చైన్ లకు హామీ ఇచ్చేందుకు భారత్ లోని భారీ పెట్రో కెమికల్ ప్లాంట్లను రస్ కెమ్ ఉపయోగించు కుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని రీజనల్ సప్లయ్ నోడ్ కీలకమైన కెమికల్ కాంపొనెంట్లను విశాఖపట్నం, కాకినాడలోని ఫార్మా, మ్యానుఫాక్చరింగ్ జోన్లకు చేరవేస్తుందని అన్నారు. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సిఇఓ తెలిపారు.
