Arundhati Roy : అరుంధతీ రాయ్ కి కేంద్రం షాక్
జర్మనీ వెళ్లకుండా అడ్డంకి
Arundhati Roy : న్యూఢిల్లీ – బుకర్ ప్రైజ్ విన్నర్, ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన రచయిత్రిగా గుర్తింపు పొందిన అరుంధతీ రాయ్ కు షాక్ తగిలింది. కేంద్ర సర్కార్ ఆమె విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే మ్యూనిచ్ లిటరరీ ఫెస్టివల్ లో అరుంధతీ రాయ్ పాల్గొనాల్సి ఉంది.
Arundhati Roy Case
గతంలో వచ్చిన ఫిర్యాదును ఆసరాగా చేసుకుని ఎయిర్ పోర్టులో బయలు దేరేందుకు సిద్దమైన ఆమెను నిలిపి వేశారు. చర్చా గోష్టిలో పాల్గొనాల్సి ఉంది. విచిత్రం ఏమిటంటే సదరు రచయిత్రిపై వచ్చిన ఫిర్యాదు దాదాపు 13 ఏళ్ల కిందటిది.
ఇప్పటికే బ్యాంకులకు కన్నాలు వేసి, కోట్లు కొల్లగొట్టిన బడా బాబులు, ఆర్థిక నేరస్థులకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రజల పక్షాన తన వాయిస్ ను వినిపిస్తూ , కలం ఝులిపిస్తున్న అరుంధతీ రాయ్(Arundhati Roy) ను మాత్రం అడ్డు కోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు బుధ్ది జీవులు.
ఇదిలా ఉండగా కశ్మీర్ సమస్యపై అరుంధతీ రాయ్ ప్రసంగించారు. ఆనాటి ఆమె ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు సునీల్ పండిట్ అనే వ్యక్తి. 2010లో పోలీసులకు అరుంధతి రాయ్ పై ఫిర్యాదు చేశారు.
Also Read : Vote From Home : ఇంటి వద్దకే ఓటు ప్రారంభం