Australia Record : ఆస్ట్రేలియా అరుదైన రికార్డ్
భారత్ పై అద్భుత విజయం
Australia Record : ఆస్ట్రేలియా అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఎదురు లేదని చాటింది. ఇంగ్లండ్ లోని ఓవెల్ మైదానం వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ జరిగింది. ఫైనల్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టును ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడించింది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా(Australia) తన క్రికెట్ చరిత్రలో కీలక రికార్డును నమోదు చేసింది.
అదేమిటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని ఫార్మాట్ లలో ఛాంపియన్ షిప్ లుగా నిలిచింది. ఇలాంటి ఫీట్ ను ఇప్పటి వరకు ఏ జట్టు సాధించ లేదు.
అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపింది ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ఇక భారత జట్టులో ఇద్దరు ముగ్గురు మినహా మిగతా ఆటగాళ్లు తేలి పోయారు. ఆసిస్ బౌలర్ల ముందు తలవంచారు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ బాధ్యతా రాహిత్యంగా వికెట్ ను పారేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్)లో పరుగుల వరద పారించిన శుభ్ మన్ గిల్ తేలి పోయాడు.
ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ చెప్పినట్లుగానే గిల్ నిరాశ పరిచాడు. ఆసిస్ బౌలర్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నాడు. అన్నట్టుగానే మనోడు వికెట్ ను పారేసుకున్నాడు. మొత్తంగా ఫైనల్ మ్యాచ్ లో పరువు పోకుండా కాపాడింది మాత్రం ఒకే ఒక్కడు అజింక్యా రహానే.
Also Read : Team India Loss : తేలి పోయారు తల వంచారు